32.2 C
India
Friday, March 1, 2024
More

  వైఎస్సార్‌ ఆసరా పథకం

  Date:

  వైఎస్సార్‌ ఆసరా పథకం కింద స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

  ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన వారు ఏమన్నారంటే…వారి మాటల్లోనే

  వై. విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

  అందరికీ నమస్కారం, సీఎంగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, రాష్ట్రమంతా కూడా మన ఉరవకొండ వైపు చూస్తున్నారు, మహిళా సంఘాలు ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నాయి, ఇది శుభసూచకం, నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నేను అసెంబ్లీలో ఇన్‌పుట్‌ సబ్సిడీపై మాట్లాడే అవకాశమిచ్చారు, అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారు, అది కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు మేం ఇవ్వమన్నారు, నాకు సంబంధం లేదన్నారు. కానీ జగన్‌ గారు మాత్రం రూ. 25 వేల కోట్లకు పైగా ఇవ్వడం చరిత్ర, రాష్ట్రంలో జగన్‌ గారి ప్రభంజనం వీస్తూ ఉంది, మహిళలు ఈ రోజు ఆత్మవిశ్వాసంతో కుటుంబాలను, రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారు, ఇది సీఎంగారి నిబద్దత, కానీ ప్రతిపక్ష నాయకులు పగటిని చూడలేరు, చీకటిని మాత్రమే చూడగలరు, వారి కళ్ళు కనిపించడం లేదు, లోకేష్‌ నోరు తిరగక మాట్లాడుతున్నాడు, అర్హత ఉంటే చాలు పథకం అందని వారున్నారా, ఇది కాదా ప్రజాస్వామ్యం. ఇక్కడే ఒక ఎస్సీ కుర్రాడికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇవ్వడానికి పయ్యావుల కేశవ్‌ తమ్ముడు మా కండువా వేసుకుంటే ఇస్తామన్నాడు, లేదంటే ఇవ్వనన్నాడు, నా దగ్గరకు వస్తే నేను చెప్పా అతనింట్లో రూ. 8 వేల కోట్లు ఉన్నాయి తెచ్చుకో అంటే నేను వెళ్ళను, ఆ పార్టీ కండువా కప్పుకోనన్నాడు, కానీ మన ప్రభుత్వంలో అలా ఎప్పుడూ జరగలేదు, పచ్చకండువా వేసుకున్నా ఎర్రకండువా వేసుకున్నా అర్హత ఉంటే ఇచ్చాం, జగన్‌ గారు కూడా మీలాగా చేసి ఉంటే మీ కండువా కప్పుకున్న వాళ్ళు ఒక్కరైనా మిగిలి ఉండేవారా, అంతేకాదు రాష్ట్రంలో మా పార్టీ నుంచి గెలిచిన వారిని పచ్చ కండువా వేసి ఆహ్వనించారు అదే పని మేం చేసి ఉంటే పయ్యావుల కేశవ్‌తో సహ ఒక్కరైనా ఎమ్మెల్యే మీ వెంట ఉండేవారా అని అడుగుతున్నా. ఈ నాలుగున్నరేళ్ళలో సుమారు రూ. 4 వేల కోట్లు మన నియోజకవర్గానికి ఇచ్చారు, గతంలో జగన్‌ గారు ఉరవకొండకు వచ్చి ఇంటి స్ధలాల గురించి పోరాడారు, అప్పుడు కేశవ్‌ స్పందించి చిత్తు కాగితాల మీద ఇంటి స్ధలాలు ఇచ్చి ఓట్లు దొంగతనం చేశారు, కుంభకర్ణుడిలా కేశవ్‌ నాలుగున్నరేళ్ళుగా ప్రజలకు ముఖం చూపలేదు, సైబీరియా నుంచి వలస పక్షులు వచ్చినట్లు కేశవ్‌ కూడా ఎన్నికలప్పుడు ఇక్కడికి వచ్చి దండాలు పెడతాడు, సీఎం సార్‌ నాలుగున్నరేళ్ళుగా మా ప్రాంతం సుభిక్షంగా ఉంది, నాడు వైఎస్సార్‌గారు జీడీపల్లి రిజర్వాయర్‌ తీసుకురావడం, మీరు రైతులకు చాలా సాయం చేస్తున్నారు, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నారు, సీఎంగారు ఇక్కడ 75 వేల ఎకరాలకు నీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను, ఇక్కడ స్ధానిక సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతున్నాను, ధన్యవాదాలు.

  మమత, లబ్ధిదారు, వజ్రకరూరు, అనంతపురం జిల్లా

  అందరికీ నమస్కారం, జగనన్నా మా మహిళల తరపున మీకు ధన్యవాదాలు, అన్నా ఈ వైఎస్సార్‌ ఆసరా మాకు చాలా సాయం చేసింది, మేం చాలా సంతోషిస్తున్నాం, మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మాకు సాయం చేశారు, నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను, నేను ఈ వైఎస్సార్‌ ఆసరా ద్వారా ఇప్పటివరకు రూ. 30 వేల లబ్ధిపొందాను, ఈ డబ్బుతో చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, గతంలో మా పొదుపు సంఘాలు అప్పులు కట్టలేక అన్నీ నిలిచిపోయాయి. కానీ ఈ రోజు ఏ బ్యాంకు ఐనా వెంటనే పిలిచి మరీ లోన్లు ఇస్తున్నాయి, దానికి కారణం మీరే, మీరు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు అందాయి, నా పెద్ద కొడుకు ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ లో చదివాడు, అన్నీ వచ్చాయి, విద్యా దీవెన, వసతి దీవెన వచ్చాయి, నా పెద్ద కొడుక్కి మూడేళ్ళు రూ. 60 వేలు, నా చిన్న కొడుక్కి మూడేళ్ళు రూ. 1.20 లక్షలు వచ్చాయి, మొత్తం రూ. 1.80 లక్షలు మీరు ఇచ్చారు, మీ వల్లే నేను ఈ రోజు పిల్లలను చదివించాను, నేను ఇలా సంతోషంగా ఉన్నానంటే కారణం మీరే, నా భర్తకు అనారోగ్యం వస్తే ఆసుపత్రికి తీసుకెళ్తే లక్షలు అవుతాయన్నారు, కానీ మీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్‌ చేయడమే కాదు చాలా చక్కగా చూసుకున్నారు, నా భర్తను క్షేమంగా తిరిగి నాకు అప్పజెప్పారు, అంతేకాదు ప్రతి నెలా రూ. 3,115 ప్రతి నెలా మందులు, ఆహారం కోసం ఇచ్చారు, నాకు చిరకాల కోరిక సొంత ఇల్లు, నేను అద్దె ఇంటిలో చాలా ఇబ్బందులు పడ్డాను, మీరు నాకు ఇంటి స్ధలం ఇచ్చారు, ఆడపడుచులకు ఇంతకంటే ఏం కావాలి అన్నా, మా సంఘానికి రూ. 10 లక్షల లోన్‌ వస్తే నేను రూ. 1 లక్ష తీసుకుని లేడీస్‌ కార్నర్‌ నడుపుతున్నాను, అంతేకాదు నేను రైల్వేస్టేషన్‌లో సఫాయివాలా గా రోజువారీ కూలీగా పనిచేస్తూ రూ. 11 వేలు సంపాదిస్తున్నాను, ఇంతకంటే నాకు ఏం కావాలి, నా పెద్ద కుమారుడు ఎంబీఏ చదువుతున్నాడు, గతంలో ఒక పెద్ద మనిషి మీరు రుణాలు కట్టద్దని మమ్మల్ని మోసం చేశాడు, మీరు మాత్రం మమ్మల్ని రుణ విముక్తులను చేశారు, మీకు ఏం చేసినా తక్కువే అన్నా, మీకు రుణపడి ఉంటాం, ధన్యవాదాలు.

  Share post:

  More like this
  Related

  Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

  Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

  JaganVadina : పవన్ పెళ్లిళ్లపై జగన్ కు ఎందుకు? #JaganVadina ట్రెండింగ్ తో ప్రశ్నిస్తున్న జనసేన నాయకులు

  JaganVadina : మొన్నటికి మొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం...

  Increasing VIPs : దేశంలో పెరిగిపోతున్న వీఐపీ, వారి ఖర్చు.. ఇతర దేశాల్లో ఎంతంటే?

  Increasing VIPs : -బ్రిటన్‌లో అధికారికంగా 84 మంది వీఐపీలు ఉన్నారు! -ఫ్రాన్స్‌లో...

  Frogs Marriage : కప్పలకు పెళ్లెందుకు చేస్తారో తెలుసా? దీని వెనకున్న కథ ఇదీ..

  Frogs Marriage Behind Story : భారత్ లో ఇప్పటికీ వివిధ...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  YS Jagan : ఏ రాజకీయ నాయకుడు ఇవ్వలేని ఆయుధాలు ఇచ్చాను: వైఎస్ జగన్

  YS Jagan : తెలుగు దేశం-జనసేన పొత్తు సీట్ల పంపకంలో భిన్నాభిప్రాయాలు...

  KA Paul : అంబేడ్కర్‌కు విగ్రహాలు అవసరమా?ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌

  KA Paul : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు విగ్రహాలు...

  Sharmila Son Marriage : షర్మిల కుమారుడి వివాహం.. మామ జగన్ షాకింగ్ నిర్ణయం!

  Sharmila Son Marriage : వైఎస్ షర్మిల-బ్రదర్ అనిల్ కుమారుడు...

  Sharmila : వైఎస్సార్ కు జగన్ కు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది తెలుసా?

  YS Sharmila : వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ కు పోలిక...