33.2 C
India
Monday, February 26, 2024
More

  Visakhapatnam Crime News : విశాఖలో ఘోరం..బాలికపై 10మంది అత్యాచారం

  Date:

  Visakhapatnam Crime News
  Visakhapatnam Crime News, Girl

  Visakhapatnam Crime News : కొత్త సంవత్సరం ముంగిట సభ్యసమాజం తలదించుకోవాల్సి వస్తోంది. దేశంలో ఆడపిల్లల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. తాము చేస్తున్న పని సరైందేనా అని కూడా ఆలోచించడం లేదు. కొన్ని నిమిషాల సుఖం కోసం ఇతరుల జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ‘నిర్భయ’ ఘటనలో ఉరిశిక్షలు పడినా.. కొందరు దుర్మార్గులు తమ కామ పైశాచికాన్ని వదలిపెట్టడం లేదు. ఇలాంటి వారి వల్ల సమాజం ఎటుపోతుందో, ఆడపిల్లల రక్షణకు దేశంలో చోటు లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

  తాజాగా విశాఖ పట్టణంలో ఒక దళిత బాలికపై 10 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. మానవ మృగాల చేతిలో ఆ బాలిక నరకాన్ని అనుభవించింది. పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి ఇంటి పనుల కోసం వచ్చిన 17ఏండ్ల బాలికను వంచించి ప్రేమ పేరుతో ప్రియుడు తొలుత కామవాంఛ తీర్చుకున్నాడు. తర్వాత తన మిత్రుడిని కూడా ఉసిగొలిపాడు. తర్వాత మరో 8మంది కూడా బాలికను రెండు రోజుల పాటు లాడ్జిలో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది.

  పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..ఒడిశాకు చెందిన ఓ కుటుంబం విశాఖ కంచరపాలెంలో నివాసం ఉంటోంది. ఈ ఇంట్లోని బాలిక రైల్వే న్యూకాలనీలో ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పనికి కుదిరింది. బాలికకు భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఈనెల 18న ఆమెను ప్రియుడు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తన స్నేహితుడినీ కూడా రప్పిస్తే అతడు కూడా ఆఘాత్యానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్ కు వెళ్లి రోదిస్తుండగా.. అక్కడ పర్యాటకులను ఫొటోలు తీసే ఓ వ్యక్తి ఆమెను జగదాంబ కూడలి సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ బంధించాడు.. అతడితో సహా స్నేహితులు ఎనిమిది మంది రెండు రోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

  ఆ తర్వాత వారి చెర నుంచి ఎలాగోలా తప్పించుకుని ఒడిశాలోని కలహండి జిల్లాలో ఉన్న స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంటి నుంచి బాలిక వెళ్లిన 18వ తేదీనే మిస్సింగ్ కేసు నమోదు చేసిన నాలుగో పట్టణ పోలీసులు 22న ఆమెను గుర్తించి కంచరపాలెంలోని ఇంటికి చేర్చారు. తనపై జరిగిన ఆఘాత్యాలతో బిక్కుబిక్కుమంటున్నా..ఆదివారం వరకు బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులతోనూ చెప్పలేకపోయింది. తాను పడ్డ బాధలను ఆదివారం చెప్పడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు 8మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రియుడు, అతడి స్నేహితుడు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి జార్ఖండ్, విశాఖ నగరాల్లో గాలిస్తున్నారు. ఈ బాలికపై అఘాత్యం ఘటన స్థానికంగానే కాదు.. రాష్ట్రంలో పెను సంచలనం సృష్టిస్తోంది.

  Share post:

  More like this
  Related

  Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

  Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

  Sameera Reddy : అప్పట్లో సైజ్ పెంచమని తెగ ఇబ్బంది పెట్టేవారు.. సమీరా రెడ్డి హాట్ కామెంట్స్

  Sameera Reddy : తెలుగు ఇండస్ట్రీపై అందం, అభినయంతో ఎంతో మంది...

  India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

  India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

  Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

  Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Polio Drops : పిల్లలకు పోలియో చుక్కలు తేదీ ఇదే.

  Polio Drops : ఆంధ్రప్రదేశ్: రాష్ట్రవ్యాప్తంగా మార్చి 3 వ తారీకు నుంచి...

  AP BJP : ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి ఏంటి?

  AP BJP : ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి బాగా లేదు....

  Andhra Pradesh : నేడే ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల తుది జాబితా ?

                AP: నేడు ఓటర్ల తుదిజాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది....

  Police Salute : శునకానికి సెల్యూట్ చేసిన పోలీస్ సిబ్బంది

  Police Salute : పోలీస్ శాఖలో మనుషులతో పాటు జంతువులు కూడా...