34.7 C
India
Friday, April 10, 2026
More

    బిడ్డ పుట్టింది కానీ.. త‌ల్లికే తెలియ‌దంటా..!

    Date:

    pregent child

    ఎవ‌రైన మ‌హిళ బిడ్డ‌ను క‌నాలంటే తొమ్మిది నెల‌లు మోయాలి. ఆ బిడ్డ‌ను అపురూపంగా చూసు కోవాల‌ని అనుకుంటారు. అలాగే స‌ద‌రు మ‌హిళ క‌న్సీవ్ అయిన విష‌యాన్ని మొద‌ట గుర్తించేది ఆమె. కానీ,పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ మ‌గ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..తనకు బిడ్డ పుట్టిన విషయ‌మే తెలియ‌ద‌ని చెప్ప‌డం ఆస‌క్తిగా మారింది. అయితే పోలీసులు త‌రువుగా విచార‌ణ చేయ‌డంతో అస‌లు విష‌య‌మేంటో తేలిపోయింది.

    పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా కాస్బాలో ఓ మ‌హిళ ఈనెల 22న టాయిలెట్‌లో ఓ బిడ్డ‌కు జ‌న్మ నిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ‌పై మ‌మ‌కారం లేని ఆమె..పేగు బంధాన్ని తెంచుకుంది. త‌న‌కు పుట్టిన బిడ్డ ఎడ‌వ‌డం మొద‌లు పెట్ట‌డ‌డంతో..వెంట‌నే టాయిలెట్ కిటికీలో నుంచి బ‌య‌ట‌కు విసిరేసింది.

    ఈ నేప‌థ్యంలోనే ఈ వ్య‌వ‌హారంలో అస‌లు విష‌యాన్ని తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. స‌ద‌రు మ‌హిళ‌ను త‌న‌కు పుట్టిన బిడ్డ గురించి ఆరా తీశారు. దీంతో త‌న‌కు ఎలాంటి బిడ్డ పుట్ట‌లేద‌ని ఆమె స‌మాధాన‌మిచ్చారు. తాను గ‌ర్భం దాల్చిన విష‌య‌మే త‌న‌కు అవ‌గాహ‌న లేద‌ని చెప్పారు. అయితే ఇదే విష‌యంపై పోలీసులు లోతుగా విచార‌ణ చేయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

    స‌ద‌రు మ‌హిళ కొద్ది రోజులు కాస్సాకు చెందిన ఓ వ్య‌క్తితో లీవింగ్ రిలేష‌న్‌లో ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఆ నేప‌థ్యంలోనే ఆ మ‌హిళ గ‌ర్భం దాల్చిన‌ట్లు తేల్చారు. అయితే ఆమెకు తొమ్మిది నెల‌లు నిండ‌డంతో ఈనెల 22న మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌న‌చ్చిన‌ట్లు గుర్తించారు. తాను చేసిన‌ త‌ప్పు ఎక్కడ బ‌య‌ట ప్ర‌పంచానికి తెలుస్తుందోన‌నే ఆమె కిటికీలో నుంచి శిశువును బ‌య‌ట‌కు విసిరేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆమెకు పుట్టిన శిశువుకు గాయాలు కావ‌డంతో చికిత్స అందించిన‌ప్ప‌టికీ..లాభం లేక‌పోయింది. ట్రిట్‌మెంట్ జ‌రుగుతుండ‌గానే బిడ్డ చ‌నిపోయింది. త‌ల్లి మాత్రం ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related