36.5 C
India
Friday, April 10, 2026
More

    కూలిన బ‌హుదా న‌ది బ్రిడ్జ్.. కింద ప‌డ్డ లారీ..!

    Date:

    bridge
    bridge
     ఏమార‌పాటు,ఆల‌స్యం ఎలాంటి ప్ర‌మాదానికైనా దారి తీయొచ్చు. స‌కాలంలో ప్ర‌భుత్వం,అధికారులు స్పందించ‌క‌పోతే పెద్ద ప్ర‌మాదాలే జ‌ర‌గొచ్చు. స‌రిగ్గా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి సంఘ‌ట‌న‌నే ఒక‌టి జ‌రిగింది. ఇచ్చాపురం జాతీయ ర‌హ‌దారిపై ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బ‌హుదా న‌దిపై బ్రిటిష్ కాలంలో అప్ప‌టి ప్ర‌భుత్వం ఒక వంతెన‌ను నిర్మించింది. అయితే వంతెన బ్రిటిష్ పాల‌న టైంలో క‌ట్టిన‌ప్పుటికీ చాన్నాళ్లు బాగానే ఉన్న‌ప్ప‌టికీ ఇటీవ‌ల వీక్ అయిపోయింది.

    అయితే ఈ విష‌యాన్ని పెద్ద‌గా అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో..ఈ బ్రిడ్జ్ పై నుంచి బుధ‌వారం అధిక లోడ్ తో వెళ్లిన లారీ వ‌ల్ల వంతెన పూర్తిగా కూలిపోయింది. వంతెన‌పైకి లారీ రాగానే చాన్నాళ్లుగా బ‌ల‌హీనంగా ఉన్న బ్రిడ్జ్ ఒక్క‌సారిగా కూప్ప‌కూలింది. ఈ సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు అటుగా పెద్ద‌గా వాహ‌నాల రాక‌పోక‌లేం లేవు. దీంతో పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది.

    ఇక బ‌హుదా న‌ది ప్ర‌తీ ఏటా వ‌ర్ష‌కాలం చాలా ఉదృతంగా ప్ర‌వ‌హిస్తుంటుంది. ఈన‌దికి చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వ‌ర‌ద‌లు వ‌స్తుంటాయి. అయితే ప్ర‌స్తుతం వంతెన ఎండ‌కాలంలో కూలిపోవ‌డంతో పెద్ద‌గా ప్ర‌మాద‌మేం జ‌ర‌గ‌లేదు. బ్రిడ్జ్‌పై వెళుతున్న లారీ ఒక్క‌టే అందులో ప‌డిపోయింది. అది కూడా వంతెన‌కు సంబంధించిన రెండు పిల్ల‌ర్లు మాత్ర‌మే కూలిపోయాయి.  రెండు,నాలుగో పిల్ల‌ర్లు మాత్ర‌మే కూప్ప‌కూలాయి.

    అంతేకాక లారీ న‌దిలో ప‌డిన టైంలో వంతెన‌,న‌దికి మ‌ధ్య ఎత్తు కేవ‌లం 20 మీట‌ర్లు మాత్ర‌మే ఉంది. దీంతో లారీ కూడా ఎక్కువ‌గా డ్యామేజ్ కాలేదు. న‌దిలో వ‌ర‌ద‌లు కూడా లేక‌పోవ‌డంతో వాహ‌నం కూడా కొట్టుకుపోలేదు. ఇక వంతెన కూలిన సంఘ‌ట‌న‌పై మాత్రం స్థానికులు మండిప‌డుతున్నారు. స‌కాలంలో వంతెన నాణ్య‌త‌ను గుర్తించి ఉంటే ఇలాంటి ప్ర‌మాదాలు జ‌రిగేవే కావ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related