
Be alert for calls : సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఆన్ లైన్ మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రజలను మోసం చేసేందుకు మోసగాళ్లు వినూత్న పద్ధతులు పాటిస్తున్నారు. దీంతో మన డబ్బులు క్షణాల్లో మాయం అవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ అటాక్ చేయొద్దని చెబుతున్నారు.
ఇటీవల కాలంలో ప్రజలను మోసం చేసేందుకు కొన్ని దోపిడీ సంస్థలు బయలుదేరాయి. అప్రమత్తంగా ఉండకపోతే మనకే ఇబ్బందులు రావడం ఖాయం. అందుకే మనం ఏదైనా అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చినా సందేశాలు వచ్చినా నిర్ధారించుకున్నాకే సమాదానం ఇవ్వాలి. మనకు తెలియని వారి నెంబర్ అయితే పట్టించుకోవద్దు.
టెలికాం శాఖ కూడా ఇప్పటికే నేరాలకు పాల్పడే వారి సంఖ్యను తగ్గించినా ఇంకా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది. లేకపోతే మన డబ్బు గోవిందా అవుతుంది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా లిఫ్ట్ చేయకపోవడమే మంచిది. దీంతో అవతలి వారు ఎవరో తేల్చుకున్నాకే సమాధానం ఇవ్వడం శ్రేయస్కరం.
దేశంలో నానాటికి సైబర నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. ప్రజలను మోసం చేసి డబ్బు లాగేందుకు ఎత్తులు వేస్తున్నారు. దీని వల్ల మనం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మనకు ఏ బ్యాంకు వారు కూడా ఫోన్లు చేయరు. ఈ విషయం తెలుసుకోవాలి. ఎవరో ఫోన్ చేసి మీ ఖాతానెంబర్, వివరాలు తెలపాలని కోరితే వెంటనే చెప్పేయకండి.






