
Cases Against Husband : అనాధిగా స్త్రీ అవమానాలు, చిత్రహింసలు, దోపిడీకి గురవుతూనే ఉంది. వీటికి బలవుతున్న మహిళలు కోకొల్లలనే చెప్పాలి. స్త్రీలపై హింస రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఎన్ని చట్టాలు చేసినా.. న్యాయవ్యవస్థ బాధితులకు అండగా నిలబడుతున్నా.. గురయ్యే వారి సంఖ్యలో పెద్దగా తేడా కనిపించడం లేదు. ముఖ్యంగా అత్తింట్లో వేధింపులకు మహిళలు ఎక్కువగా గురవుతున్నారు. ఈ నేపథ్యలో వారికి అత్తింటి వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కొన్ని చట్టాలు చేసింది. దీంతో కర్కోటక భర్తలపై కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. అయితే ఈ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికీ తెలిసిందే..
మహిళల వైపు ఎక్కువ చట్టాలు ఉన్నాయని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదో ఒక చట్టంలో ఇరికిస్తే తమకు భయపడతాడు, చెప్పినట్లు వింటాడని భావిస్తున్నారు. అందుకే తప్పు లేకున్నా కూడా కేసులు పెడుతూ భర్తలను ముప్పు తిప్పల పెడుతున్నారు. భార్యాభర్తలలో ఎవరైనా ఒకరి మీద మరొకరు తప్పుడు కేసులు పెట్టుకుంటే, అవి తప్పుడు కేసులు అని నిరూపణ అయితే జీవిత భాగస్వామితో విడాకులు కోరే హక్కు కల్పించేలా చట్టసవరణ చేయాలని లా కమిషన్ 18 సంవత్సరాల కిందటే కేంద్రానికి సూచించింది. ఎందరో మహిళలు అత్తా, మామల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. అందుకే చట్టాలు వారికి అనుకూలంగా ఉన్నాయి. అయితే వీటిని ఆసరాగా చేసుకొని ఓ మహిళ కూడా అలాంటి పనే చేసింది. ఒక్క కేసు కాదు.. ఒక మహిళ ఎన్ని రకాల కేసులు పెట్టగలదో.. అన్ని రకాల కేసులను భర్తపై పెట్టింది.
అలా భర్తను కేసుల్లో ఇరికించి కోర్టు చుట్టూ తిరిగేలా చేసింది. ఇలా భర్తపై కేసులు పెట్టి హింసించిన మహిళ చేసిన పనికి అందరూ ఆశ్చర్యానికి గురువుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఓయో హోటల్ రూమ్ లో పరాయి వ్యక్తితో పట్టుబడింది సదరు మహిళ. పరాయి వ్యక్తితో ఒంటరిగా ఉండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఆమె బండారం బయటపడింది. అప్పటి వరకూ భర్త విషయంలో ఆమె చెప్పిన మాటలు నమ్మిన స్థానికులు. ఆమె చేసిన పనితో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా వేధింపులకు గురయ్యే మహిళలకు ఈ చట్టాలు వర్తిస్తే మంచిదే కానీ.. ఆ చట్టాల్లోని లొసుగులను వాడుకొని వేధిస్తున్న ఇలాంటి మహిళలను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.