30.1 C
India
Sunday, April 19, 2026
More

    సీఐ వేధింపులు భ‌రించ‌లేక‌.. చ‌నిపోతున్నా..!

    Date:

    crime
    crime

    సీఐ వేధింపుల‌కు ఓ అమాయ‌కుడు బ‌ల‌య్యారు. హృద‌య విదార‌క‌ర‌మైన ఈ సంఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ జిల్లా చొప్ప‌దండిలో చోటు చేసుకుంది. చొప్ప‌దండి మండ‌లం భూపాల‌ప‌ట్నం గ్రామానికి చెందిన శ్యామ్ అనే వ్య‌క్తి స్థానికంగా రియ‌ల్ బ్రోక‌ర్‌గా ప‌ని చేస్తుండేవారు. ఈయ‌న క‌రీంన‌గ‌ర్ విద్యార‌ణ్య‌పురిలో కుటుంబంతో క‌లిసి నివాస‌ముంటూ..భూముల క్ర‌య‌,విక్ర‌య‌ వ్య‌వ‌హారాలు చూసేవాడు. ఈ నేప‌థ్యంలోనే క‌రీంన‌గ‌ర్ బ్యాంకు కాల‌నీలో నివాస‌ముంటున్న సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ అధికారి గోపికృష్ణ‌తో శ్యామ్ కు ప‌రిచ‌య‌డం ఏర్ప‌డింది.

    దీంతో గోపికృష్ణ‌కు త‌న స్వంత గ్రామంలో భూమి కొనుగోలు చేయాల్సిందిగా కోరారు. గోపికృష్ణ భూమి కొనుగోలు చేస్తే దాన్ని తిరిగి 5-6 నెల‌ల్లో మ‌ళ్లీ అద‌నంగా రూ.10ల‌క్ష‌ల‌కు అమ్మిస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే ఆఫ‌ర్ న‌చ్చ‌డంతో గోపికృష్ణ భూపాల‌ప‌ట్నంలో శ్యామ్‌ను మ‌ధ్య‌వ‌ర్తిగా ఉంచి 20 గుంట‌ల భూమిని రూ.50 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేశారు. ఈ నేప‌థ్యంలోనే శ్యామ్ గోపికృష్ణ‌కు చెప్పిన గ‌డువు ముగియ‌డంతో ఆయ‌న చెప్పిన ప్ర‌కారం భూమిని అమ్మి త‌న డ‌బ్బులు తిరిగి చెల్లించాల‌ని కోరారు.

    అయితే శ్యామ్ అనుకున్న‌ట్లు గోపికృష్ణ కోనుగోలు చేసిన భూమి స‌కాలంలో అమ్ముడు పోలేదు. దీంతో శ్యామ్‌పై గోపికృష్ణ ఒత్తిడి పెంచారు. ఇచ్చిన గ‌డువు ప్ర‌కారం త‌న భూమిని అమ్మివ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అంతేకాకుండా ముందు చెప్పిన ప్ర‌కారం అద‌నంగా ప‌ది ల‌క్ష‌ల‌ లాభాన్ని చూపించాల‌ని స్ప‌ష్టం చేశారు. దీంతో చేసేదేమి లేక శ్యామ్ అప్పు చేసి గోపికృష్ణ‌కు రూ.3 ల‌క్ష‌లను స‌మ‌ర్పించుకున్నారు. అయిన‌ప్ప‌టికీ గోపికృష్ణ నుంచి ఒత్తిడి త‌గ్గ‌లేదు. దీంతో చివ‌ర‌కు గోపికృష్ణ వేధింపులు భ‌రించ‌లేని శ్యామ్ గురువారం స్వంత ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Karimnagar : ఏం ఐడియా సర్.. ఎండల నుంచి ఇలా ఉపశమనం

    Karimnagar Petrol Pump : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఉష్ణోగ్రతలు భయంకర...

    Audio Call Viral : సీఐ బాత్రూం బకెట్‌లో రూ.3 లక్షలు.. వైరల్ గా మారిన ఫోన్ కాల్

    Audio Call Viral : కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఫోన్ కాల్...

    Sankranti Holidays : సంక్రాంతి పండుగ సెలవులకు వెళ్లేవారు ఈ నిబంధనలు తప్పక పాటించాలి.

    1. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులు ఉంచకుండా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి 2...

    Mumbai: కట్టు దిట్టమైన భద్రతలో ముంబై.. కారణం ఇదే..

    Mumbai: హిందువులకు అతిపెద్ద పండుగ దేవీ నవరాత్రోత్సవాలు. దేశం యావత్తు అత్యంత భక్తి...