Ganapathi Laddu Thief : దొంగతనానికి ఏదీ అడ్డు కాదు. మనసులో ఆలోచన ఉంటే చాలు. ఎంతటి దొంగతనమైనా చేయొచ్చు. కంప్యూటర్ యుగంలో సీసీ కెమెరాలు వాడుతున్నా దొంగతనాలు ఆగడం లేదు. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా కాదేదీ అడ్డు కాదు దొంగతనానికి అని నిరూపిస్తున్నారు. ఈనేపథ్యంలో దేవుడికి కూడా రక్షణ లేకుండా పోతోంది. చోరీలు ఇంత సులభంగా చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ఏరియాలోని వినాయకుడి చేతిలో ఉన్న లడ్డును ఓ దొంగ సులభంగా తీసుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమారు 11 కిలోల లడ్డును ఆ దొంగ చేతిలో పట్టుకుని పరుగు పెడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా నిలుస్తోంది. పటిష్ట బందోబస్తు కోసం ఎంత సాంకేతికత వాడుతున్నా చోరులు మాత్రం వారి చేతులకు పని చెబుతూనే ఉన్నారు.
దేవుడి లడ్డు వేలం వేస్తే రూ. లక్షల్లో ఆదాయం వస్తుంది. అలాంటి లడ్డును ఉచితంగా కొట్టేయాలనే అతడి ఆలోచనకు రూపం ఇచ్చే క్రమంలో ఇలా చోరీ చేయడం గమనార్హం. దేవుడి చేతిలో పెట్టిన లడ్డును దొంగతనంగా తీసుకెళ్లాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. దీంతో వినాయక మండపానికి ఎలాంటి కాపలా లేదని విమర్శలు వస్తున్నాయి.
అంత స్వేచ్ఛగా ఇంట్లోకి వచ్చినట్లుగా వచ్చి లడ్డు దోచుకెళ్లడం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. కానీ దొంగను మాత్రం ఇంతవరకు గుర్తించలేదు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. దేవుడికే రక్షణ లేకుండా పోతే ఇక మనుషుల సంగతేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో లడ్డు దొంగను ఎప్పుడు? ఎలా పట్టుకుంటారు. వీడియో ఉండటంతో అతడిని గుర్తించి లడ్డును రికవరీ చేయాలని భక్తులు కోరుతున్నారు.
కెమెరాకు చిక్కిన లడ్డు దొంగ
హైదరాబాద్ – మియాపూర్ గణేష్ మండపం వద్ద పెట్టిన 11కేజీల లడ్డు దొంగతనం చేస్తూ ఓ యువకుడు సీసీటీవీ కెమెరాలలో దొరికాడు. pic.twitter.com/8lT5ytP5yY
— Telugu Scribe (@TeluguScribe) September 21, 2023