జర్మనీ చర్చిలో నరమేధం చోటు చేసుకుంది. గురువారం రాత్రి హోంబర్గ్ లోని చర్చిలో కాల్పులకు తెగబడ్డారు ఓ నరహంతకుడు. దాంతో పలువురు మరణించగా పెద్ద ఎత్తున క్షతగాత్రులయ్యారు. కాల్పులకు పాల్పడింది ఎవరు ? ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అన్నది తెలియాల్సి ఉంది. చర్చిలో కాల్పులు జరగడంతో స్థానికలు ఎవరూ బయటకు రావద్దని , అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జర్మనీ ప్రభుత్వం పౌరులను కోరింది.
జీహాదీల గ్రూప్ లతో జర్మనీ గతకొంత కాలంగా ఇబ్బంది పడుతోంది. గత ఆరేళ్లుగా వరుసగా పలు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వరుస కాల్పులలో పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. దాంతో ఈసారి ఛాలెంజ్ గా తీసుకుంది జర్మనీ ప్రభుత్వం. అందుకే సంఘటన జరిగిన హోంబర్గ్ లోని యెహోవా విట్ నెస్ సెంటర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు పోలీసులు. పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.