నవీన్ హత్య కేసులో అనూహ్యమైన ట్విస్ట్ ……. ఏ 1 గా హరిహర కృష్ణ పై నేరారోపణ చేయగా ఏ 2 గా ప్రియురాలు నిహారిక రెడ్డిని చేర్చారు పోలీసులు. ఇక ఏ 3 గా హరిహర స్నేహితుడు హాసన్ ను కూడా చేర్చారు. నవీన్ ను అత్యంత దారుణంగా హరిహర కృష్ణ చంపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నవీన్ ను హరిహర హత్య చేసినట్లుగా ప్రియురాలు నిహారిక రెడ్డికి అలాగే మరో స్నేహితుడు హసన్ కు ముందుగానే తెలిసినప్పటికీ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు దాంతో వాళ్ళిద్దరిని ఏ 2 , ఏ 3 గా చేర్చారు. అలాగే నిహారిక , హసన్ లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
నిహారిక రెడ్డి హత్యా స్థలానికి వెళ్లి నవీన్ మృతదేహాన్ని చూసిందని , అలాగే హరిహరేకృష్ణకు 1500 రూపాయలు పంపించిందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతోందని , విచారణ పూర్తయ్యాక మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు పోలీసులు.