
Death Happened : హిందూ వివాహ వ్యవస్థలో భార్యా, భర్తల బంధం అతి పవిత్రమైనది. ఎలాంటి రక్త సంబంధం లేకుండా ఒక్కటైన జంట ఒంట్లో శ్వాస ఉన్నంత వరకూ కలిసే ఉంటారు. ఇప్పటి పరిస్థితులు వేరు అది పక్కన ఉంచితే.. ఏడేడు జన్మలకు ఆయనే తనకు భర్తగా, ఆమెనే తనకు భార్య కోరుకుంటారు. ఇంతటి గొప్ప వివాహ వ్యవస్థలో భార్య ఇంటిని చక్క పెడుతుంటే భర్త కుటుంబ భారం మోస్తుంటాడు. అయినా ఇద్దరూ కష్ట సుఖాలను కలిసే పంచుకుంటారు. తల్లి దండ్రులు, అత్తా మామలు ఇరు కుంటుంబాలు కూడా బంధుత్వం కలుపుకొని ఆజన్మాంతం ఒకరికొకరు తోడు నీడగా ఉంటారు. ఇదంతా కలిసి ఉన్న వారి గురించి చెప్పుకున్నాం కానీ జంటలో ఒకరు చనిపోతే వారి జ్ఞాపకాలు మోయలేక బరువెక్కిన మరొకరు సూసైడ్ చేసుకుంటున్నారు. అలాంటి ఒక ఘటన ఇక్కడ చూద్దాం.
వారికి వివాహమై నాలుగు నెలలే అయ్యింది. ఇద్దరి మధ్యా మంచి బంధం ఏర్పడింది. అయితే కారణం తెలియదు గానీ నాలుగు నెలలకు ఆమె ఉరేసుకొని మరణించింది. సరిగ్గా సంవత్సరానికి ఆమె భర్త ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. హుస్నాబాద్ లో జరిగిన ఘటనపై ఎస్ఐ వివరాలు తెలిపాడు.. కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, నేదునూర్ గ్రామానికి చెందిన బొల్లంపల్లి శ్యాంసుందర్ (35) కళాకారుడు. హుస్నాబాద్ లోని గోదాంగడ్డ కాలనీకి చెందిన శారదను ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన నాలుగు నెలలు దంపతులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత పుట్టింటికి వచ్చిన శారద 20 సెప్టెంబర్, 2022 రోజున తల్లిగారింటి వద్ద చెట్టుకు ఉరేసుకొని మరణించింది. అప్పట్లో ఆమె కుటుంబ సభ్యులు శ్యాంసుందర్ పై కేసు కూడా నమోదు చేశారు.
శారద చనిపోయినప్పటి నుంచి శ్యాం సుందర్ చాలా డీప్రెషన్ లోకి వెళ్లాడు. నాలుగు నెలలే కలిసి ఉన్నా తన భార్య జ్ఞాపకాల నుంచి బయటపడలేకున్నానని వాపోయేవాడు. తన స్నేహితుల వద్ద కూడా తన భార్య గురించే మాట్లాడేవాడు. దీంతో సరిగ్గా ఏడాది తర్వాత వారి పెళ్లిరోజు మే 15న (మే 14 అర్ధరాత్రి) హుస్నాబాద్ లోని అత్తింటి ఎదుట ఉన్న చెట్టు (తన భార్య ఉరేసుకున్న) వద్ద పురుగుల మందు తాగి మరణించాడు. దీంతో అందరూ వారి బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కొన్నిరోజులు కలిసి ఉన్నా జీవితకాలం బంధం ఏర్పడిందని అంటున్నారు.