
Robbed: భర్త మరణించడం ఉన్న ఇద్దరు కొడుకులు వృత్తి రిత్యా వెళ్లిపోవడంతో ఒంటరిగా మిగిలింది ఆ తల్లి. ఒంటరి తనం నుంచి బయట పడేందుకు.. ఇంటి వద్ద ఇంత సాయంగా ఉంటుందని ఒక వ్యక్తికి ఇంటిలోని ఒక పోర్షన్ ను ఒక మహిళకు అద్దెకు ఇచ్చింది. ఆమె ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించి ఇద్దరూ కలిసి వృద్ధురాలిని హత్యచేసి ఆమె నగలను దోచుకెళ్లారు. ఈ ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ వివరించారు.
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్ కు చెందిన సంరెడ్డి సత్తెమ్మ (82)-స్వామిరెడ్డి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లతో నివసించే వారు. స్వామి రెడ్డి చాలా కాలం క్రితం కాలం చేశారు. ఇక ఇద్దరు కొడుకుల్లో పెద్దవాడు బాల్ రెడ్డి వనస్థలిపురంలో, చిన్నవాడు గోపాల్ రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. ఇక పెద్ద కూతురును వనస్థలిపురంకు, రెండో కూతురును బొల్లారంకు ఇచ్చింది. బంధువుల వివాహం నిమిత్తం చిన్న కూతురు వద్ద ఎనిమిది రోజులు ఉంది. ఆ తర్వాత పెద్ద కూతురు ఇంటికి వెళ్లి ఆదివారం తన ఇంటికి వచ్చింది.
ఆదివారం సాయంత్రం వరకు ఇరుగు పొరుగు వారితో ముచ్చటించింది సత్తెమ్మ. సోమవారం ఇరుగు పొరుగు వారు వచ్చి తలపుతట్టగా స్పందించలేదు. దీంతో పక్కన ఉన్న ఒక తలపును తొలగించి లోపలికి వెళ్లి చూడగా విగత జీవితగా పడి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న సీపీ డీఎస్ చౌహాన్, డీసీపీ సాయిశ్రీ పరిసరాలను పరిశీలించారు. ఇరుగు పొరుగును విచారించగా వృద్ధురాలి ఇంట్లో మరో గదిలో ఉన్న లలిత గురించి చెప్పారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది.
నారాయన్ పేట జిల్లా, దామరగిద్దకు చెందిన ఎడ్ల రాకేశ్ ఓ ఫైనాన్స్ సంస్థలో పని చేస్తున్నాడు. ఆయన అన్న తొర్రూరులోని సత్తెమ్మ ఇంటి ఎదుట ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ నిర్మాణ పనులను చూసుకునేందుకు రాకేశ్ అప్పుడప్పుడూ వచ్చేవాడు. ఈ నేపథ్యలో లలిత, రాకేశ్ కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వచ్చినప్పుడల్లా సత్తెమ్మ ఒంటిపై ఉన్న బంగారు నగలపై కన్నేశాడు రాకేశ్. ఆమెను హత్య చేసి నగలు దోచుకోవాలని పన్నాగం పన్నాడు. హత్య పథకం లలితకు వివరించాడు. ఇద్దరూ ఆదివారం రాత్రి సత్తెమ్మ గదిలోకి చొరబడ్డారు. లలిత కాళ్లు పట్టుకోగా రాకేశ్ గొంతునులిమి హత్య చేశాడు. ఒంటిపై బంగారం తీసుకొని పరారయ్యారు. సోమవారం ఎలాంటి అనుమానం రాకుండా గుంపులో కలిసిపోయారు. పోలీసులు వీరిని రిమాండ్ కు పంపి బంగారం స్వాధీనం చేసుకున్నారు.






