
ఫిడోఫైల్ గాళ్లతో నిజంగానే కష్టం. తక్కువ వయస్సు ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం వీరికి బాగా ఇష్టం. అంటే రెండో లేక మూడో కాదు.. ఏకంగా తనకంటే 30, 40 సంవత్సరాల తక్కువ వయస్సున్నవారిని పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ ఇలాంటి ఒక వ్యక్తి ఏకంగా తనకంటే 31 సంవత్సరాల చిన్న వయస్సున చిన్నారిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా రూ. 4.5 లక్షలకు ఒప్పందం చేసుకొని మరీ.
రాజస్థాన్ రాష్ట్రం, ధోల్‌పూర్ జిల్లా, మానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఏడేళ్ల బాలికతో 38 ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకున్నాడన్న వార్త వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సదరు నిందితుడు ఒక మధ్య వర్తిని ద్వారా బాలిక తండ్రికి రూ. 4.5 ఇచ్చి తన కూతురిని పెళ్లి చేసుకునేందుకు డీల్ చేసుకున్నాడు.
ఏడేళ్ల చిన్నారికి 38 సంవత్సరా వ్యక్తితో వివాహం జరిగినట్లు సమాచారం అందుకొని దాడికి వెళ్లినట్లు మణియన్ సీఓ దీపక్ ఖండేల్వాల్ తెలిపారు. అనంతరం బృందంగా విర్జాపుర గ్రామానికి వెళ్లారు. ఊరి బయట నిర్జన ప్రదేశంలో ఇల్లు కట్టుకున్నారు. ఆ బాలిక ఇంట్లో ఆడుకుంటూ కనిపించింది. మెహిందీ చేతులకు ఉంది. పాదాల మీద వేప పువ్వులు, మంగు నిండుగా ఉంది. ఆమె ఫోన్‌లో కార్టూన్లు చూస్తోంది. బాలికను విచారించే ప్రయత్నం చేయగా ఆమె ఏమీ చెప్పలేకపోయింది.
చిన్నారిని కొనుగోలు చేసిన వ్యక్తి మే 21, 2023న ఆమెను పెళ్లి చేశాడు. ఆ అమ్మాయికి పెళ్లి విషయం కూడా తెలియనంత చన్నతనం. కనీసం పెళ్లి గురించి ఆమె పోలీసులకు చెప్పలేనంత చిన్నపిల్ల, ఆమెను విచారించినా పోలీసులకు ఆమె ఎలాంటి వివరాలు తెలపలేదు. దీంతో పోలీసులు సదరు నిందితుడిపై పోక్సోతో పాటు, మానవ అక్రమ రావాణా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చిన్నారి తండ్రి సుల్తాన్ ఆమెను మహేంద్ర సింగ్ కొడుకు భూపాల్ సింగ్‌తో వివాహం జరిపించాడు. ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.