23 C
India
Tuesday, October 6, 2026
More

    Police chase : సినీ ఫక్కీలో పోలీసుల ఛేజింగ్.. ఇంతకీ దొంగలు దొరికారా..?

    Date:

    Police chase
    Police chase

    Police chase : ముందు దొంగలు వెనుక పోలీసులు ఇదేదో సినిమా అనుకుంటే పొరబాటే మరి. కానీ సినిమాను పోలిన నిజమైన సన్నివేశం మన తెలంగాణ జిల్లాల్లోనే ఈ ఘటన జరిగింది. దొంగలను వెంబడించుకుంటూ వెళ్లిన పోలీసులు జనావాసాల మధ్యనే ఫైర్ ఓపెన్ చేశారు. దీంతో ఏమవుతుందోనంటూ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. సినిమాలో క‌నిపించేలా దొంగ‌లను పోలీసులు వెంబ‌డించారు. వారు త‌ప్పించుకునే క్రమంలో సినిమా రేంజ్ లో ఛేజింగ్ చేస్తూ.. పోలీసులు వారిపై కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని నిజామాబాద్ జిల్లాలోనే  చోటుచేసుకుంది.

    ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలను ఇక్కడ చూద్దాం. దొంగలను పట్టుకునేందుకు నిజామాబాద్‌ జిల్లా లోని, ఇందల్‌వాయి మండలం, జాతీయ రహదారిపై పోలీసులు కాపు కాశారు. గమనించని దొంగలు సమీపంలోకి వచ్చారు పోలీసులను గమనించి దొంగ‌లు త‌ప్పించుకోవ‌డానికి యత్నించారు. ఛేజింగ్ చేసే క్రమంలో పారిపోతున్న దొంగలపై పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారు. కొంత కాలంగా ఈ ప్రాంతంలో దొంగ‌ల దాడులు చేస్తూ.. ధన ప్రాణ నష్టం సృష్టిస్తున్నారు. వందలాది మంది ఫిర్యాదులు చేశారు. ఈ ముఠా రాజస్థాన్ కు చెందినదని గుర్తించిన పోలీసులు కాపుకాచి పట్టుకునేందుకు యత్నించారు.

    పోలీసులు వారిని ప‌ట్టుకోవ‌డానికి ప‌క్కా స్కేచ్ సిద్దం చేశారు. ఇందులో భాగంగా వారు వచ్చే ప్రాంతాల్లో కాపు కాశారు. ఈ విష‌యం తెలుసుకున్న దొంగ‌లు పోలీసుల కారును ఢీకొట్టి పారిపోయారు. అవాక్కయిన పోలీసులు వారిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని తుపాకీతో బెదిరించేందుకు యత్నించారు. అయినా వారు వినకపోవడంతో రెండు రౌండ్లు కాల్పులు కూడా జరిపారు. అయినా వారు పట్టుబడలేదు. దీంతో వారిని పట్టుకునేందుకు పలు బృందాలుగా మారారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎలాగైనా వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    stolen : ఊరికి వెళ్లి వచ్చేసరికి.. 3 లక్షల సొత్తు చోరీ

    stolen : రంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఇటీవల హైదరాబాద్ సిటీ...

    Chain Snatching : నాగోల్ లో చైన్ స్నాచింగ్.. ఇల్లు రెంటు కోసం వచ్చి దొంగతనం

    Chain Snatching : రెంటుకు ఇల్లు కావాలంటూ వచ్చారు.. వృద్ధురాలు ఒక్కతే...

    Hyderabad News : కుత్బుల్లాపూర్ లో దారుణం.. క్యాబ్ డ్రైవర్ ను గాయపరిచి దోపిడీ

    Hyderabad News : హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో దారుణం జరిగింది. అర్ధరాత్రి...

    Rangareddy News : దోపిడీ దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు..

    Rangareddy News : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో 3...