
Seventh class girl : సభ్య సమాజం సిగ్గుపడే ఘటన ఒకటి ఛండీగఢ్ లో జరిగింది. ఒక చిన్నారిపై ఐదుగురు లైంగికదాడికి పాల్పడ్డారు. సదరు బాలిక తల్లి కలుగజేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది ఆ రాష్ట్రంలో సైతం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. చండీగఢ్ లో ఏడో తరగతి చదువుతున్న బాలికపై ఐదుగురు విద్యార్థులు లైంగికదాడికి పాల్పడ్డారు. చండీగఢ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న (Seventh class girl) విద్యార్థినిపై అదే పాఠశాలకు చెందిన ఐదుగురు బాలురు పలుమార్లు లైంగిక దాడి చేశారు. మిగతా నలుగురు తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు.
నేరం చేసిన తర్వాత ఒక విద్యార్థి తన స్నేహితులకు చెప్పాడు. పార్కుతో సహా వివిధ ప్రదేశాలలో బాలికపై లైంగికదాడి చేసినట్లు ఆయన చెప్పుకచ్చాడు. ఈ నెల 18న కేసు నమోదు చేసినప్పటికీ కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు వెల్లడించలేదు. ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు జువైనల్ హోంకు తరలించారు. తన కూతురు ఆరోగ్యం విషయంలో తేడా రావడంతో గమనించిన తల్లి పాఠశాల సిబ్బందిని నిలదీసింది. దీంతో ఈ విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది. పాఠశాల యాజమాన్యం వెంటనే ఛండీగఢ్ విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఐదుగురు బాలురు మైనర్లు కావడంతో వారిపై సెక్షన్ 376 ఏబీ – 12 ఏళ్లలోపు మహిళపై లైంగికదాడికి పాల్పడడం, సెక్షన్ 4 – లైంగిక దాడికి శిక్ష, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోస్కో) తో సహా ఆరు తీవ్రమైన దాడుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.