- పోలీసులకు అప్పగించిన స్థానికులు

Taking petrol from the bike and setting fire to the same bike : మనసిక వ్యాధిగ్రస్తుల ప్రవర్తన వింతగా ఉంటుందని మనకు తెలుసు. వారు ఎప్పుడు ఏం చేస్తారు.. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేది ఎవరికీ అంతు పట్టదు. కొందరు హత్యలు చేస్తుంటే మరికొందరు చిన్న చిన్న నేరాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా మెలగాలని మానసిక వైద్యులు సూచిస్తుంటారు. ఇక్కడ ఒక మహిళ చాలా వింతగా ప్రవర్తిస్తుంది. ఆమెకు ఏమైనా మానసిక మైన జబ్బు ఉందా..? లేక వారేమన్నా సదరు మహిళకు కీడు కేశారా తెలియదు కానీ ఆమె మాత్రం వారికి తీరని నష్టం మాత్రం చేశారు.
ఢిల్లీలోని జైత్‌పూర్ పోలీస్ పరిధిలో ఒక మహిళ విచిత్ర ప్రవర్తన సీసీ కెమెరాకు చిక్కింది. సోషల్ మీడియాలో చర్చంతా ఆమె చుట్టే తిరుగుతుంది. అసలు విషయం ఏంటంటే.. జైత్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గల్లీకి వచ్చిన ఒక మహిళ మెల్లగా అక్కడున్న బైక్ ల వద్దకు వచ్చింది. వెంట తెచ్చుకున్న బాటిల్ తో బైక్ లోని పెట్రోల్ ను తీసింది. ఇక అదే పెట్రోల్ (petrol ) అదే బైకుపై పోసి నిప్పంటించింది. మరో బైక్ కు నిప్పంటించేందుకు ప్రయత్నించడంతో స్థానికులు లేచి సదరు మహిళను పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి వచ్చిన పోలసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కావాలని చేసిందా.. లేక సదరు బైక్ యజమాని ఆమెకు ఏమైనా కీడు చేశాడా.. లేదా సదరు మహిళ మానసిక వ్యాధిగ్రస్తురాలా అనేది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు చెప్తున్నారు. కాగా బైక్ ఓనర్ మాత్రం చాలా తీవ్రంగా బాధపడ్డాడు.