36.5 C
India
Friday, April 10, 2026
More

    మత్తు ఇచ్చి కోరిక తీర్చుకొని.. ఆ కామాంధుడికి ఆస్ట్రేలియా కోర్టు గట్టి శిక్ష

    Date:

    punishment
    punishment
    అతనో మృగం.. యువతులకు మాయ మాటలు చెప్పి వంచిస్తాడు. అబద్దాలు చెప్తూ వారికి మత్తు మందు ఇచ్చి వారు అచేతన స్థితిలోకి వెళ్లగానే రేప్ చేస్తాడు. రేప్ చేసే చిత్రాలను ఫోన్ లేదా సీక్రెట్ కెమెరా లేదా అలారం వాచీలో బందిస్తాడు. తర్వాత వాటిని చూపుతూ బ్లాక్ మెయిల్ చేస్తాడు. రాజకీయ నేపధ్యం ఉండడంతో తనకేమీ కాదని అనుకున్నాడు. కానీ వాని పాపం పండి కోర్టు తీవ్రంగా స్పందించింది.

    భారత సంతతికి చెందిన ప్రముఖుడు బాలేష్ ధన్కడ్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. ఐదుగురు అమ్మాయిలను రేప్ చేసిన ఘటనలో అక్కడి కోర్టు సోమవారం ఆయనను ధోషిగా నిర్ధారించింది. కొరియన్ కు చెందిన ఐదుగురు యువతులకు మత్తు మందు ఇచ్చి వారిపై లైంగికదాడికి పాల్పడినట్లు తేల్చింది. మానవ మృగంగా కోర్టు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. నీచమైన రేపిస్ట్ అంటూ అక్కడి మీడియా రాసింది.

    బాలేష్ ధన్కడ్ వృత్తి పరంగా డేటా ఎక్స్ పర్ట్. యువతులతో ఫ్రెండ్ షిప్ పెంచుకోవడం, వారిని ఇంటికి పిలవడం, హోటళ్లకు తీసుకెళ్లడం, వారికి తెలియకుండా డ్రగ్స్ ఇచ్చి మత్తులోకి దించి ఆపై లైంగిక దాడి చేయడం, సదరు వీడియోలు, ఫొటోలను ఫోన్, అలారం వాచ్ లో దాస్తుంటాడని 39 అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి.

    అక్కడి న్యాయమూర్తి మైకేల్ కింగ్ బెయిల్ నిరాకరించాడు. దీంతో బాలేష్, అతని భార్య కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మేలో కోర్టు ముందు హాజరవ్వాలి. దాదాపు ఏడాదిలోనే ఆయనకు శిక్ష పడే అవకాశం ఉంది.

    తన వైవాహిక జీవితం సరిగా లేదని, అందుకే ఇలాంటి పని చేశానని బాలేష్ రోధిస్తూ చెప్పాడు. దీనికి తోడు కోర్టులని, లాయర్ ఫీజులని ఇలా చాలా ఆస్తి పోగొట్టుకున్నానని చెప్పాడు. 2018లో ఇతని వద్ద పోలీసులకు వీడియోలు లభించాయి. ఆ వీడియోలను చూసిన జ్యూరీ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Road accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం: గుంటూరుకు చెందిన విద్యార్థిని దుర్మరణం

    Road accident in America : గుంటూరుకు చెందిన యువతి అమెరికాలో...

    Crime News : పరువు హత్య.. కూతురిని ప్రేమించాడని యువకుడిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన తండ్రి

    Crime News : పుట్టినరోజు నాడే మృతి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు పెద్దపల్లి జిల్లా...

    Betting : బెట్టింగ్ యాప్స్: వెయ్యి మంది ప్రాణాలు బలి!

    Betting : తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ విషాదం నింపుతున్నాయి. గడిచిన ఏడాది...

    baldness : బట్టతలపై భార్య హేళన.. భర్త బలవన్మరణం

    baldness : కర్ణాటకలోని చామరాజనగర ప్రాంతానికి చెందిన పరాశివమూర్తి, మమత భార్యాభర్తలు. పెళ్లినాటికే...