34.7 C
India
Friday, April 10, 2026
More

    తుని కేసు కొట్టివేత – బాధ్యులు ఎవరు?

    Date:

    tuni
    tuni

    తుని రైలు ఘటనలో విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు కేసు కొట్టివేస్తున్నట్లు  తెలిపింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కాపు రిజర్వేషన్ల పేరుతో చిచ్చు పెట్టి ప్రయాణికులతో వెళ్తున్న రైలును ప్లాన్ ప్రకారంతగులబెట్టించారు కరడుగట్టిన రాజకీయ నేతలు. అంతేనా పోలీసులను వ్యక్తిగత ఆస్తులనూ వదల్లేదు. ఎంత విధ్వంసం చేయాలో అంతా చేశారు. ఆ కేసులను వైసీపీ ప్రభుత్వం రాగానే ఉపసంహరించుకుంది. రైల్వే పోలీసులు పెట్టిన కేసును తాజాగా కోర్టు కొట్టి వేసింది.

    ఈ సందర్బంగా న్యాయ స్థానం ముగ్గులు రైల్వే ఉన్నతాధికారులు ఈ కేసు విచారణ సరిగా చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. సున్నితమైన ఈ కేసును ఐదేళ్లపాటు ఎందుకు సాగదీశారని ప్రశ్నించింది. బాధ్యులైన ముగ్గురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రైలులో అంతమంది  ప్రయాణిస్తే ఒక్కరిని మాత్రమే విచారించడం ఏంటని ప్రశ్నించింది. సాక్షిగా ప్రవేశ పెట్టిన వ్యక్తి కూడా రైలులో ప్రయాణించ లేదు అనడం గమనార్హం.

    ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపులు కూడా ఉన్నాయి కదా.. వైసీపీ నేతల ప్రత్యక్షంగా ఇచ్చిన రెచ్చగొట్టుడు ప్రకటనలు ఉన్నాయి కదా అని చాలా మందికి డౌట్ రావొచ్చు.కానీ ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా కోర్టు ముందు ప్రవేశ పెట్టలేదు.న్యాయమూర్తే ఈ విషయం చెప్పారు. ఐదేళ్లు కేసును సాగదీసి ఒక్క సాక్షిని మాత్రమే ప్రవేశ పెట్టారని ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదని మండిపడి ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ.. అసలు నిందితులు 41 మందిపై పెట్టిన కేసుల్ని అక్రమ కేసులుగా పరిగణిస్తూ విజయవాడ రైల్వే కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పేశారు.

    ఈ కేసులో ప్రదానంగా కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి దాడిశెట్టి రాజా, వన్‌ టీవీ ఎండీ మంచాల సాయిసుధాకరనాయుడు, సినీ నటుడు జీవీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామన ప్రభాకరరావు, కాపు నాయకులు కల్వకొలను తాతాజీ, వాసిరెడ్డి ఏసుదాసు, నల్లా విష్ణుమూర్తి, ఆకుల రామకృష్ణ వంటి వారు ఉన్నారు.అందరూ నిర్దోషులైతే రైలును ఎవరు తగులబెట్టినట్లు అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mudragada Padmanabham : నేను అసమర్ధుడినే.. పవన్ దమ్మున్న నేత ఒప్పుకుంటా : ముద్రగడ పద్మనాభం

    Mudragada Padmanabham : కాపు ఉద్యమ నేత, వైసీపీ లీడర్ ముద్రగడ...

    కాపు ఉద్యమంపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..

    Kapu Movement :కాపు ఉద్యమానికి ఒకప్పటి నాయకుడు ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలు...