
Hyderabad : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కైట్ & స్వీట్స్ ఫెస్టివల్ బుధవారం ముగిసింది. ఈ ఫెస్ట్కు శ్రీలంక, థాయిలాండ్, జపాన్, వియత్నాం, మలేషియా, సౌత్అఫ్రికా, సింగపూర్, పోలాండ్ వివిధ దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లేయర్స్ హాజరయ్యారు. ఇందులో టెడ్డీ, రోబోట్, డోరేమోన్ వంటి పతంగులు చిన్నారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 3 రోజుల్లో 15 లక్షల మంది సందర్శించినట్లు అధికారులు అంచనా వేశారు.