
Pashupatinath temple : ప్రపంచంలో ఏకైక హిందూ దేశం నేపాల్. అక్కడ ఉన్న కట్టడాలు చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. నేపాల్ రాజధాని ఖాట్మండ్. ఇక్కడ ఉన్న దేవాలయాలు చూస్తే కళ్లు అబ్బురపరుస్తాయి. భక్తిభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. అక్కడ ఉన్న దేవాలయాల్లో ప్రాచీనమైనవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాటిలో పశుపతినాథ్ ఆలయం అన్నింటికంటే ప్రాచీనమైనది. మహాశివరాత్రి సమయంలో ఇక్కడ బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది.
ఇక్కడ గత ఏడాది శివరాత్రి సమయంలో శివలింగం చుట్టు బంగారంతో జలహరిని ఏర్పాటు చేశారు. దీనికి గాను 103 కిలోల బంగారాన్ని వాడారు. దీనికి పశుపతి ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ దాని నిర్వహణ బాధ్యత తీసుకుంది. బంగారంతో కూడిన పనులు చేయడంతో ఇందులో గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బంగారం పెద్ద మొత్తంలో వాడటంతో దాదాపు పది కిలో బంగారం మాయమైనట్లు వార్తలు వస్తున్నాయి.
దీనిపై అక్కడి పార్లమెంట్ లో కూడా రగడ రేగుతోంది. పది కిలోల బంగారం అంటే మామూలు విషయం కాదు. కోట్లతో కూడిన వ్యవహారం కావడంతో పాలకులు, ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంత మొత్తంలో బంగారం మాయం కావడంలో ఎవరి పాత్ర ఉంది? దానికి బాధ్యులెవరనే దానిపై లోతుగా విచారణ సాగుతూనే ఉంది. కానీ ఇంతవరకు బాధ్యులెవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
నేపాల్ అవినీతి నిరోధక శాఖ (సీఐఏఏ) దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విచారణ వేగవంతం చేశారు. దీనికి సంబంధించిన నేరస్తులెవరో పట్టుకునే వరకు విచారణ ఆపేది లేదని చెబుతున్నారు. దేవుడి సొమ్మునే కాజేసిన వారిని విడిచిపెట్టేది లేదని అందరు డిమాండ్ చేస్తున్నారు.






