
105 seats: భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశంలో గులాబీ బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వ్యవహరించాల్సి వ్యూహంపై పలు సూచనలు చేశారు. పార్టీని మరోసారి ప్రభుత్వంలోకి తీసుకుచ్చేందుకు ఏం చేయాలో ఎలా ప్రజల మధ్యకు వెళ్లాలో బాస్ దిశా నిర్దేశం చేశారు. గతంలో ఎప్పడూ బాస్ మీటింగ్ పెట్టినా వణుకు కనిపించలేదని కానీ ఇప్పుడు కనిపించిందంటూ పార్టీలో టాక్ వినిపిస్తుంది.
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 105 సీట్లు రావడం ఖాయమని ఆయన పార్టీ సమావేశంలో శ్రేణులకు వివరించారు. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, చేసింది చెప్పుకుంటే చాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ప్రచారం ఎలా చేయాలి అన్నదానిపై బాస్ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు పార్టీ నాయకులు చెప్తున్నారు. జూన్ 2వ తేదీ నుంచి ప్రచారం చేయడం ప్రారంభించారు. కోడ్ వచ్చేందుకు కేవలం 100 రోజులు మాత్రమే ఉందని బహుషా ఆగస్ట్ లో వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. అప్పటి వరకూ తాపీగా ప్రారంభిస్తామని అనుకోకుండా.. ఇప్పటి నుంచే ప్రారంభించాలని ఆయన సూచించారు.
ఇప్పటి వరకూ నిర్వహించిన సర్వేల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని నిరూపణ అయ్యిందని, ఈ ఏడాది చివరలో కూడా మన ప్రభుత్వమే కొలువు దీరుతుందన్నారు. పదేళ్లలో తెచ్చిన పథకాలు, వాటితో లబ్ధిపొందిన వారి వివరాలు సేకరించి వారితో కలిసి ఓటర్ల వద్దకు వెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే చివరి వరకు అంచనాలు మారవచ్చని కొందరు నేతలు బాస్ దృష్టికి తీసుకెళ్లారు. అందుకే ఎలా ప్రచారం చేయాలో షెడ్యూల్ కూడా రూపొందించినట్లు ఆయన వివరించారు.