
11million within 24hours Bro motion poster : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”బ్రో”.. పవన్ కీ రోల్ పోషిస్తుండగా సాయి తేజ్ హీరోగా కేతిక శర్మ హీరోయిన్ గా ఈ సినిమా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతుంది.. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఒరిజినల్ కూడా సముద్రఖని నటించి తెరకెక్కించారు. ఆయన చేసిన పాత్రనే తెలుగులో పవన్ చేస్తున్నాడు..
తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వినోదయ సీతం అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.. తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.. నిన్న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేసిన ఈ మోషన్ పోస్టర్ సరిగ్గా 24 గంటల్లోనే రికార్డ్ వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టించాడు పవన్.. పవర్ స్టార్ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో దీని ద్వారా అర్ధం అయ్యేలా తెలిపాడు..
24 గంటల్లోనే యూట్యూబ్ లో 11 మిలియన్ వ్యూస్ రాబట్టి సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసి చరిత్రను తిరగరాశారు.. ఇది ఇండియాలోనే ఆల్ టైం రికార్డ్ అనే చెప్పాలి.. ఇప్పటి వరకు సౌత్ లో అజిత్ వలిమై సినిమా మోషన్ పోస్టర్ 24 గంటల్లో 5.1 మిలియన్ వ్యూస్ రాబట్టగా ఇప్పుడు దానికి డబల్ తెచ్చుకుని పవర్ స్టార్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు..
అయితే వలిమైకి 9 లక్షల లైక్స్ వచ్చాయి.. కానీ పవన్ కళ్యాణ్ బ్రో (Bro motion poster) సినిమా దీని దరిదాపుల్లోకి కూడా రాలేక పోయింది.. ఈ సినిమాకు మాత్రం కేవలం 20 వేల లైక్స్ మాత్రమే రావడంతో ఈ రికార్డ్ మిస్ అయ్యిందని పవన్ ఫ్యాన్స్ కొద్దిగా ఫీల్ అవుతున్నారు. ఇక జులై 28న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.