Old Ganapati Statue : కాకతీయుల కళావైభవానికి ప్రతీక. చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. దీనికి నల్గొండ జిల్లాకు ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ అనేక ఆధారాలు లభిస్తాయి. కాకతీయుల కాలంలో చెరువులు, నీటి బావులను తవ్వించారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మెట్ల బావులు కూడా దర్శనమిస్తుంటాయి. దీనికి నల్గొండ జిల్లా సూర్యపేట గుర్తింపు పొందింది.
నిజాం కాలంలో సాయుధ తెలంగాణ పోరాటంలో ఎందరో తమ ప్రాణాలు అర్పించారు. ఎన్నో వనరులు ఏర్పాటు చేసుకున్నారు. అందులో మంచినీటి బావులు కూడా ఉన్నాయి. కాకతీయుల కాలంలో కట్టడాలు, ఆలయాలు, బావులు నిర్మించారు. సూర్యపేటలో 1300 ఏళ్ల నాటి మెట్ల బావి బయట పడటం గమనార్హం. ఇక్కడ 120 ఏళ్లనాటి గణపతి విగ్రహం బయటపడటం విశేషం.
కాకతీయుల కాలంలో శిల్ప కళా సంపదకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. నాటి కాలంలో కట్టించిన కట్టడాలు కాలగర్బంలో కలిసిపోయినవి ఉన్నాయి. అవి బయటపడుతుండటంతో అధికారులు విచారణ ప్రారంభించారు. సూర్యపేట జిల్లా ఆత్మకూరులో జరిపిన పరిశోధనలో ఈ బావి బయటపడింది. పురాతన చెన్నకేశవ స్వామి ఆలయంలో లోపల నలువైపులా నిర్మాణాలను పరిశీలిస్తున్నారు.
చెన్నకేశవ స్వామి విగ్రహం 16వ శతాబ్దం నాటిదని తేల్చారు. ఇరువైపుల ఉన్న అల్వార్ విగ్రహాలు 18వ శతాబ్దం నాటివని గుర్తించారు. రాతిస్తంభాలతో ఉన్న ముఖ మండపం కూడా 18వ శతాబ్దం నాటిదే. మెట్ల బావి మాత్రం 13వ శతాబ్దానికి సంబంధించిందని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఆలయ నిర్మాణం 300 సంవత్సరాల క్రితమే నిర్మించిందని అంటున్నారు.
ఆత్మకూరు గ్రామంలో జరిపిన అన్వేషణలో దొరికిన గణపతి విగ్రహాన్ని పరిశీలించారు. ఈ విగ్రహం 8వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు. 120 సంవత్సరాల చరిత్ర దీనికి ఉందని తేల్చారు. చాళుక్యుల కాలంలో నల్ల శానపు రాతిలో చెక్కిన చేతులు, తలపై కిరీటం లేని విగ్రహంగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. గ్రామంలో దొరవారి బావిలో నలబై ఏళ్ల క్రితం బావి పూడిక తీత సందర్భంగా ఈ విగ్రహం దొరికింది.