12th Fail into OTT : కొన్ని సినిమాలు యూత్ కు ఇన్స్పిరేషన్ కలిగించేలా ఉంటాయి. అలాంటి ఆణిముత్యాలు రావడమే ప్రస్తుత కాలంలో అదురుగా మారింది. యూత్ ను పక్కదారి పట్టించే కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. యువ రక్తాన్ని నాశనం చేసే కటెంట్ తోనే ఓటీటీల్లో ఎక్కువగా సినిమాలు, సీరిస్ లు నిండిపోయాయి కూడా. వాటికి యూత్ కూడా అంతగానే అట్రాక్ట్ అవుతుంది. ఫలితంగా చాలా సమస్యలు మొదలవుతాయి. వీటి నుంచి తట్టుకొని నిలబడి సక్సెస్ సాధించిన మూవీ ‘12th Fail’.
ఇద్దరు వ్యక్తుల నిజ జీవితాల కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ విధూ వినోద్ చోప్రా. ఒక విధంగా చప్పాలటే ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ అధికారి శ్రద్ధా జోషి ఆటో బయోగ్రఫీ మూవీనే ‘12th Fail’. ఈ మూవీ 27 అక్టోబర్, 2023న థియేటర్లలో రిలీజైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో సాగింది. ముఖ్యంగా పేరంట్స్ వారి పిల్లలకు చూపించేందుకు ఎక్కువ ఇంట్రస్ట్ చూపించారట. ఒక మారుమూల పల్లెటూరులో 12 క్లాస్ లో ఫెయిల్ అయిన యువకుడు పట్టుబట్టి ఐఏఎస్ కొట్టడం చాలా గొప్ప విషయం.
థియేట్రికల్ లో రిలీజైన ఈ మూవీ కొన్ని రోజుల్లోనే తన ప్రదర్శన ముగించుకుంది. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చింది. కానీ కేవలం హిందీలో మాత్రమే రిలీజైంది. కానీ ఇప్పుడు దీన్ని తెలుగు డబ్ చేసి రిలీజ్ చేశారు. డిస్నీ+హాట్‌స్టార్ లో మార్చి 5వ తేదీ నుంచి తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ లో ఉంది. దీన్ని చూసేందుకు ఓటీటీ లవర్స్ ఎక్కువగా ఇంట్రస్ట్ చూపుతున్నారు.