Baby మనసుకు హత్తుకుపోయే ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు ‘బేబీ’ టీమ్.. చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే విషయం పక్కన పెట్టి మరీ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు.. ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా బేబీ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. మరి 13 రోజుల్లో ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది.
13వ రోజు కూడా బేబీ సినిమా కలెక్షన్స్ తగ్గలేదు.. యంగ్ డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన ‘బేబీ’ సినిమా ఇప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తుంది.. ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీ రోల్స్ పోషించారు. జులై 14న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఫస్ట్ షోతోనే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.
మౌత్ టాక్ తోనే ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. రెండవ వారం కూడా భారీ వసూళ్లను రాబడుతూ ఇంకా యూత్ ను ఆకట్టుకుంటూనే ఉంది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ముందుకు దూసుకు పోతుంది.. మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను సాధిస్తూ దూసుకెళ్తున్న ఈ సినిమా 13వ రోజు కూడా బాగానే రాబట్టింది..
కేవలం 7.40 కోట్ల బిజినెస్ చేసి 8 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ట్రిపుల్ లాభాలను అందుకుంటుంది.. 13వ రోజు 90 లక్షల షేర్, 1.60 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఇప్పటి వరకు 35.64 కోట్ల షేర్, 67.10 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే రేపు పవర్ స్టార్ బ్రో రిలీజ్ కాబోతుండడంతో బేబీ సినిమా దాదాపు క్లోజ్ అయినట్టే.. ఇక ఈ సినిమా రన్ పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తుంది.. చూడాలి క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత రాబడతాయో..