
14th Horoscope : నేడు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామనే శ్రద్ధ అందరికి ఉంటుంది. రోజువారీ జాతకంలో మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని అడుగులు వేస్తుంటారు. మనం ఈ రోజు ఏ పనులు చేయకూడదో ఏ పనులు చేయాలో అవగాహన తెచ్చుకుని ప్రవర్తిస్తాం. మనకు ప్రతికూలతలు తెచ్చే అంశాలపై ముందే తెలుసుకుని జాగ్రత్తగా ఉండటం అవసరమే.
మేష రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. ధనలాభ సూచనలున్నాయి. అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారికి జీవిత భాగస్వామితో చికాకులు పెరుగుతాయి. చేతిలో డబ్బు నిల్వదు. పనులు మందకొడిగా సాగుతాయి. కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పక్షులకు నీళ్లు ఏర్పాటు చేయడం మంచిది.
సింహరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అమ్మవారిని పూజించండి. కన్య రాశి వారికి ముఖ్యమైన పనుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తుల రాశి వారికి రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో అనుకూలమైన సమయం.
వృశ్చిక రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. గోమాతను పూజించండి. ధనూ రాశి వారికి ఆకస్మికంగా డబ్బు అందుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మృత్యుంజయ మంత్రం చదవడం మంచిది.
మకర రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభ ఫలితాలు వస్తాయి. పక్షులకు నీళ్లు పెట్టడం మంచిది. కుంభ రాశి వారికి చికాకు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. అమ్మవారిని ఎర్ర పూలతో పూజించండి. మీన రాశి వారికి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో లాభాలు దక్కుతాయి సూర్యుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయి.






