
14th September Horoscope : మేష రాశి వారికి ఆచారాలను గౌరవిస్తారు. వాగ్వాదాలకు దూరంగా ఉండండి. పనికొచ్చే నిర్ణయాలు తీసుకుంటే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
వ్రషభ వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికంగా లాభాలున్నాయి. లక్ష్మీ దేవిని సందర్శించడం ఉత్తమం.
మిథున రాశి వారికి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. ముఖ్యమైన పనుల్లో సలహాలు తీసుకోవాలి. శివ ధ్యానం చేయడం శుభకరం.
కర్కాటక రాశి వారికి పనులు త్వరగా పూర్తవుతాయి. ఆస్తి విషయాల్లో విజయం మీదే. ధర్మబద్ధకంగా వ్యవహరిస్తారు. సూర్యుడిని జపిస్తే మంచి లాభాలుంటాయి.
సింహ రాశి వారికి ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక వైపు అడుగులు వేస్తారు. అనుకూల కాలం. సూర్యుడిని పూజించడం మంచిది.
కన్య రాశి వారికి పనుల్లో వేగం ఉంటుంది. కొన్ని పనుల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. అలసట లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం చదవడంవల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
తుల రాశి వారికి అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. అధికారుల సహకారం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు.
వ్రషభ రాశి వారికి సమయానికి సాయం చేస్తారు. శుభవార్తలు వింటారు. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శని శ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి.
ధనస్సు రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. అవసరానికి సాయం చేసే వారుంటారు. శత్రువులను తక్కువగా అంచనా వేయొద్దు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
మకర రాశి వారికి ఆచితూచి వ్యవహరించాలి. గొడవలకు దూరంగా ఉండాలి. చంచల మనస్తత్వాన్ని వీడాలి. అధికారుల పని మీకు నచ్చదు. నవగ్రహ శ్లోకాలు చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
కుంభ రాశి వారికి శత్రువులపై విజయం సాధిస్తారు. సంతోషంగా గడుపుతారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వెంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది.
మీన రాశి వారికి ఒక శుభవార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. అధికారుల ప్రశంసలు దక్కుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. హనుమాన్ చాలీసా చదవడం వల్ల అనుకూలంగా ఉంటుంది.