
18th September Horoscope : మేష రాశి వారికి చేపట్టే పనుల్లో విజయం లభిస్తుంది. కీలక వ్యవహారాలు పూర్తి చేస్తారు. మనసు అదుపులో ఉంచుకోవాలి. గురు ఆరాధన శుభకరం.
వ్రషభ రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. ప్రశాంతంగా ముందుకు వెళతారు. ప్రయత్నాలతో పనుల్లో ఉత్సాహం ఉంటుంది. ఇష్టదేవత ఆరాధన మంచిది.
మిథున రాశి వారికి ఒక వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అధికారులు మీకు అండగా నిలుస్తారు. పెద్దలు మీకు సహకరిస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది.
కర్కాటక రాశి వారికి ముఖ్యమైన పనులు ముందుకు వెళతాయి. సమయానికి సాయం చేసేవారుంటారు. కీలక పనుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. లక్ష్మీధ్యానం చేయడం మంచిది.
సింహ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. చంచలంగా వ్యవహరించడం వల్ల కొత్త చిక్కులు ఏర్పడతాయి. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.
కన్య రాశి వారికి తొందరపాటుగా ఉండకూడదు. ఇలా చేస్తే సమస్యలు వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులొస్తాయి. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది.
తుల రాశి వారికి చేసే పనుల్లో సానుకూల ఫలితాలొస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనేందుకు మొగ్గు చూపుతారు. ఇష్టదేవతారాధన చేయడం శుభప్రదం.
వ్రశ్చిక రాశి వారికి సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దు. ఆచితూచి అడుగు వేయాలి. మనోధైర్యం కలిగి ఉంటారు. విష్ణువుని ఆరాధించడం సురక్షితం.
ధనస్సు రాశి వారికి గ్రహబలం ఉంది. ఉద్యగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. దైవారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మకర రాశి వారికి మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు నెరవేరతాయి. ఇష్టమైన వారితో సంతోషంగా ఉంటారు. దేవతారాధన మేలు కలిగిస్తుంది.
కుంభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులున్నాయి. కొన్ని వ్యవహారాలు బాధిస్తాయి. అందరిని గుడ్డిగా నమ్మొద్దు. సూర్య నమస్కారం చేయడం వల్ల మంచి జరుగుతుంది.
మీన రాశి వారికి సమయానికి డబ్బు చేతికి అందుతుంది. మనోబలం కలిగి ఉంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. చంద్ర ధ్యానం చేయడం సురక్షితం.