27.8 C
India
Wednesday, February 18, 2026
More

    19th June Horoscope : నేటి రాశి ఫలితాలు

    Date:

    19th June Horoscope
    19th June Horoscope

    19th June Horoscope : ఈ రోజు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకోండి. ప్రతి ఒక్కరూ తమకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూసుకోవాలనే కుతూహలం ఉంటుంది. ద్వాదశ రాశుల వారికి ఎదురయ్యే శుభ, అశుభ ఫలితాలు బేరీజు వేసుకుని రోజు వారీ కార్యక్రమాలకు వెళ్లడం సహజం. అందుకే నేటి ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకుని ముందుకు వెళ్లొచ్చు. అందుకే తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

    మేషరాశి వారికి మంచి కాలం. విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. అధికారులు మద్దతుగా నిలుస్తారు. దుర్గాదేవి దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది.

    వృషభ రాశి వారికి పనుల్లో ముందుకు సాగండి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చులను అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

    మిథున రాశి వారికి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసర విషయాల్లో తల దూర్చొద్దు. ఆలోచనలను ఇతరులతో పంచుకోడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల మంచి జరుగుతుంది.

    కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమంగా ఉంటుంది. మనోధైర్యం కోల్పోకండి. తోటి వారితో స్నేహంగా ఉండండి. దైవారాధనతోనే పరిస్థితులు చక్కబడతాయి.

    సింహ రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలే మీకు అండగా నిలుస్తాయి. నిర్ణయాలు తీసుకోవడంలో సాహసంగా కదులుతారు. విష్ణు దర్శనం చేసుకోవడం ఉత్తమం.

    కన్యరాశి వారికి అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. సమయాన్ని వృథా చేసుకోవద్దు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది. శ్రీరామనామాన్ని జపించడం మంచిది.

    తుల రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మంచి కాలం. పనుల్లో ఆటంకాలు ఎదురైనా ముందడుగు వేస్తారు. శ్రమ పెరిగినా అందుకు అనుగుణంగా ఫలితాలు వస్తాయి. వాగ్వాదాలకు దిగొద్దు. దైవారాధన మంచిది.

    వృశ్చిక రాశి వారికి చేపట్టే పనులు ముందుకు సాగుతాయి. బంధువుల సహకారం అందుతుంది. లక్ష్మీ సహస్రనామం చదివిే మంచిది.

    ధనస్సు రాశి వారికి చేపట్టే పనులు పూర్తవుతాయి. శుభకార్యాల్లో ముందడుగు వేస్తారు. బంధుమిత్రులతో గడుపుతారు. విష్ణు సహస్ర నామాలు చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

    మకర రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. దైవబలం రక్షణగా నిలుస్తుంది. నలుగురికి అండగా ఉంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి.

    కుంభ రాశి వారికి బుద్ధి బలం పెరుగుతుంది. అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాల్లో మంచి ఫలితాలు వస్తాయి. వినాయకుడిని ఆరాధించడం వల్ల ఇంకా మంచి ఫలితాలుంటాయి.

    మీన రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. పనుల్లో ముందడుగు వేస్తారు. ప్రణాళికాబద్ధంగా నడవండి. గోవింద నామాలు చదివితే మంచిది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Today Horoscopes : రాశిఫలాలు : ఈరోజు వ్యాపారులకు లాభాలు.. ఉద్యోగులకు పదోన్నతి

    Today Horoscopes :  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జేష్ట నక్షత్రం శనివారం...

    Sri Krishna Janmashtami : 30 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ జన్మాష్టమి రోజున ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే..

    Sri Krishna Janmashtami : ప్రతీ ఏటా భాద్రపదమాసం, కృష్ణ పక్షం,...

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...