
19th September Horoscope : మేష రాశి వారికి మంచి కాలం. విందు వినోదాలు ఆనందపరుస్తాయి. పనుల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇష్టదేవతారాధన చేయడం మంచిది.
వ్రషభ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక శుభవార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. పనుల్లో ఆటంకాలు ఉండవు. శ్రీవారి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
మిథున రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. చేసే పనుల్లో అలసట రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. శివ నామం జపిస్తే శుభం కలుగుతుంది.
కర్కాటక రాశి వారికి మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్ కు సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటారు. ఆశించిన ఫలితాలుంటాయి. శివనామం జపించడం మంచిది.
సింహ రాశి వారికి ఒక వార్త ఆశ్చర్యపరుస్తుంది. చేపట్టే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రశాంతంగా ముందుకు సాగితే అనుకూలమే. సూర్యారాధన మంచి ఫలితాలు తెస్తుంది.
కన్య రాశి వారికి ఉద్యోగంలో పై వారి సహకారం లభిస్తుంది. మీ ప్రతిభతో ముందుకు వెళతారు. ఏకాగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి. దుర్గాధ్యానం శభకరం.
తుల రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభ కాలం. చేపట్టిన పనులు పూర్తవువతాయి. ఇష్టదేవతారాధన చేయడం శుభాలు కలుగుతాయి.
వ్రశ్చిక రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడతాయి. ఒక వార్త మీకు నష్టం కలిగిస్తుంది. చేసే పనుల్లో శ్రమ ఎక్కువవుతుంది. ఆంజనేయ స్వామి దర్శనం మంచి చేస్తుంది.
ధనస్సు రాశి వారికి మంచికాలం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నైపుణ్యం సంపాదించుకుని ముందుకు వెళతారు. ఇష్టదేవతారాధన మంచిది.
మకర రాశి వారికి చేసే పనుల్లో ఆటంకాలు ఉండవు. సమయానికి చేతికి డబ్బు అందుతుంది. ఒక వార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. శివారాధన చేయడం మేలు కలిగిస్తుంది.
కుంభ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంది. శుభ ఫలితాలుంటాయి. మీ ఆత్మవిశ్వాసమే ముందుకు నడిపిస్తుంది. ఆరోగ్యం కాపాడుకోవాలి. లక్ష్మీధ్యానం చేయడం అనుకూలం.
మీన రాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది. ప్రయాణాల్లో లాభాలుంటాయి. ఇష్టదేవతారాధన మంచిది.