
Millets : మనదేశంలో చిరు ధాన్యాలకు విలువ ఇస్తాం. వాటిని తినేందుకు ఇష్టపడతాం. అన్నం కు బదులు వీటినే తీసుకుంటాం. దీంతో మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ నేపథ్యంలో మన ఆహార ధాన్యాల విలువను పెంచే ఉద్దేశంతో ప్రధాని అమెరికా పర్యటనలో యోగా గురించి తెలియజేశారు. ఇంకా వంట్లో కూడా మనం ఉపయోగించే ధాన్యాలను పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు.
అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ చిరుధాన్యాల విషయమై స్పందించారు. మోడీ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో చిరుధాన్యాలతో చేసిన వంటకాలు ఉండటంతో చెఫ్ నీనా కుర్ిస్ తో కలిసి పనిచేస్తున్నట్లు శ్వేత సౌధం ఎగ్జిక్యూటివ్ క్రిస్ చెప్పారు. ఈ అధికారిక విందుకు సంబంధించిన మెనూను శ్వేత సౌధం పేస్ట్రీ చెఫ్ సుసీ మారిసన్ తయారు చేయడం గమనార్హం.
ఇందులో మారనేటెడ్ మిల్లెట్స్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలాడ్, పుచ్చకాయ, అవకాడో ఉన్నాయి. ఇంకా మష్రూమ్స్, కుంకుమ పువ్వుతో కూడిన రిసోటో, లెమన్ దిల్ యోగర్ సాస్, మిల్లెట్ కేక్స్, వేసవి పానీయాలు అందించనున్నారు. ఐక్యరాజ్య సమితి 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో ఇక చిరు ధాన్యాల గురించి దేశాల్లో ప్రచారం జోరుగా సాగనుంది.
ప్రధాని మోడీ మన అలవాట్ల గురించి చేసే ప్రచారాల్లో ఇవి ఉండటం గమనార్హం. భారత్ లో పండించే చిరు ధాన్యాల వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుందని తెలియజేసేందుకు కంకణం కట్టుకుని మన అలవాట్లు ఇతర దేశాల వారికి సైతం మేలు చేస్తాయని చెబుతున్నారు. వ్యవసాయంలో రసాయనాలు వాడటం వల్ల ఇబ్బందులు వస్తున్నందున చిరుధాన్యాల వినియోగం అవసరం.






