23.7 C
India
Sunday, October 13, 2024
More

    2024 Rules : 2024 న్యూ వెహికిల్స్, ఫార్మా కంపెనీలకు నిబంధనలు.. వీటిపై కూడా లుక్కేయండి..

    Date:

    Ather new scooty
    Ather new scooty

    ఏథర్‌ నుంచి కొత్త స్కూటర్‌
    విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఏథర్‌ (Ather) నుంచి కొత్త స్కూటర్ మోడల్ విడుదలైంది. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఏథర్‌-450 అపెక్స్‌ (Ather 450 Apex)ను సంస్థ శనివారం (జనవరి 6) రోజున లాంచ్‌ చేసింది. ధర రూ.1.89 లక్షలుగా నిర్ణయించింది. 450ఎస్‌, 450ఎక్స్‌ మోడళ్లను రిలీజ్ చేసింది. ఏథర్‌ లో 3.7kWh బ్యాటరీ ఇచ్చారు. సింగిల్‌ ఛార్జితో 157 కిలో మీటర్ల వరకు వస్తుంది. ఐదు రైడింగ్‌ మోడ్‌లు ఇచ్చారు. వ్రాప్‌ మోడ్‌ స్థానంలో కొత్తగా వ్రాప్‌ ప్లస్‌ ఇచ్చారు. మ్యాజిక్‌ ట్విస్ట్‌ అనే ఫీచర్‌ తెచ్చారు. థ్రోటల్‌ రిలీజ్‌ చేసిన ప్రతిసారీ బ్రేక్‌ వేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా బ్రేక్‌ అప్లయ్‌ అయ్యేలా డిజైన్ చేశారు. గరిష్ఠంగా 100 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఇడియమ్‌ బ్లూ కలర్ లో తెచ్చారు. ఐదేళ్లు/ 60వేల కిలో మీటర్ల బ్యాటరీ వారెంటీ ఇస్తున్నారు. బుకింగ్స్‌ గత నెల (డిసెంబర్) నుంచే ప్రారంభమయ్యాయి. రూ.2500 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. మార్చి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి.

    టాటా ‘పంచ్‌ ఈవీ’ బుకింగ్స్‌
    భారత దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ ‘టాటా’ మోటార్స్ తన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో మొదటి ‘పంచ్ ఈవీ’ని మార్కెట్లోకి తీసుకచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇది ఎలక్ట్రికల్ వేరియంట్‌. దీనికి సంబంధించిన ముందస్తు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కంపెనీ డీలర్లు, స్టోర్ల వద్ద రూ.21 వేలు చెల్లించి, అధికారిక వెబ్‌సైట్ లో కూడా బుకింగ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. టాటా పంచ్ EV ధర రూ.12 లక్షల నుంచి మొదలవుతుందని అంచాన. సన్‌రూఫ్, నాన్-సన్‌రూఫ్‌లో లభిస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ కోసం 7.2kW హోమ్ చార్జర్, 3.3 kW వాల్‌బాక్స్ చార్జర్‌ అందజేస్తున్నారు. ముందు LED హెడ్‌ల్యాంప్‌లు, 17.78 సెం.మీ హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీల సరౌండ్-వ్యూ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు కారులో అందించారు.

    ఫార్మా కంపెనీలకు కొత్త రూల్స్
    ప్రమాణాలు, నిబంధనలకు అనుగుణంగా ఫార్మా సంస్థలు తమ ఉత్పత్తులను కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి శనివారం (జనవరి 6) నోటిఫికేషన్ విడుదలైంది. నాణ్యత, భద్రతపై గతంలో వచ్చిన ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎగుమతి చేసిన దేశీయ ఔషదాల వల్ల విదేశాల్లో ఆరోగ్య పరిస్థితులు దిగజారుతున్నాయని ఫిర్యాదులు అందాయి. ఇది ఫార్మా రంగాన్ని దెబ్బతీస్తుందని భావించిన ప్రభుత్వం ఈ రంగంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని కొత్త నియామాలను తీసుకువచ్చింది.

    మందుల నాణ్యతపై ఆయా సంస్థలదే పూర్తి బాధ్యతని, అన్ని పరీక్షలు పూర్తియిన తర్వాత ‘సంతృప్తి కర ఫలితాలు’ పొందిన తర్వాతే మార్కెట్లోకి రిలీజ్ చేయాలని ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొంది. గతంలో 8,500 చిన్న ఫార్మా కంపెనీల్లో నాలుగింట ఒక వంతు కంటే తక్కువ మాత్రమే WHO ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత ఔషధ పరిశ్రమ దాదాపు 50 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను కలిగి ఉంది.

    ఎర్ర సముద్రంలో దాడులు
    ఎర్ర సముద్రంలోని యెమెన్ కు చెందిన హౌతీలు చేస్తున్న దాడులతో నౌకా రవాణాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇది భారత్ వాణిజ్యంపై ప్రభావం పడుతుంది. ఈ దాడుల మూలంగా సరకు రవాణా వ్యయంతో పాటు ఇన్సురెన్స్‌ ప్రీమియం పెరగనుందని ఆర్థిక మేధో సంస్థ గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చి ఇనిషియేటివ్‌ (GTRI) పేర్కొంది. మధ్య ధరా సముద్రానికి, హిందూ మహాసముద్రానికి మధ్యనున్న ఎర్ర సముద్రంలో బాబ్‌ ఎల్‌ మాందెబ్‌ జలసంధి గుండా సరకు రవాణా నౌకలు ప్రయాణిస్తుంటాయి. ఈ జలసంధి వద్దే హౌతీలు దాడులు చేస్తున్నారు. దీంతో నౌకలు కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ గుండా ప్రయాణం సాగించాల్సి వస్తుంది. ఈ కారణంగా సరకు రవాణా 20 రోజులు ఆలస్యం అవుతుంది. మధ్యప్రాశ్చం, ఆఫ్రికా, యూరప్‌ దేశాలతో భారత వాణిజ్యం ప్రధానంగా ఈ మార్గం గుండానే జరుగుతోంది. దేశానికి వచ్చే క్రూడ్ ఆయిల్, ఎల్‌ఎన్‌జీ దిగుమతుల కోసం భారత్‌ బాబ్‌ ఎల్‌ మాందెబ్‌ జలసంధిపైనే ఆధారపడుతోంది. యూరప్‌, ఆఫ్రికాతో జరిగే వాణిజ్యంలో 50 శాతం దిగుమతులు, 60 శాతం ఎగుమతులకు ఈ మార్గమే ఆధారం. 113 బిలియన్‌ డాలర్ల వర్తకం జరుగుతోంది.

    హౌతీల దాడులతో కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ వంటి మార్గాల వైపు చూడాల్సిన అవసరం ఏర్పడిందని జీటీఆర్‌ పేర్కొంది. ‘ఎర్ర సముద్రంలో దాడుల కారణంగా షిప్పింగ్‌ కాస్ట్‌ 40 నుంచి 60 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇతర మార్గాల ద్వారా ప్రయాణంతో సరకు రవాణా 20 రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇన్సురెన్స్‌ ప్రీమియం కూడా 15 నుంచి 20 శాతం మేర పెరిగే అవకాశం ఉంది’ అని జీటీఆర్‌ఐ పేర్కొంది.
    బాబ్‌ఎల్‌ మాందెబ్‌ జలసంధిలో షిప్పింగ్ అంతరాయాలను భారత్ చాలా కాలం ఎదుర్కోవాల్సి ఉంటుందని, స్వప్రయోజనాలను కాపాడుకునేందుకు భారత్‌ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని జీటీఆర్‌ఐ సహ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు.

    ఎల్‌ఐసీపై మళ్లీ జీఎస్టీ దాడి
    లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు జీఎస్టీ నుంచి డిమాండ్ నోటీస్ అందింది. జీఎస్‌టీ శాఖ రూ.663 కోట్లు డిమాండ్ చేసింది. వారంలో సంస్థకు ఇది రెండో నోటీస్. CGST, సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నుంచి చెన్నై నార్త్ కమిషనరేట్ నుంచి నోటీస్ అందింది. జనవరి 1న ఎల్‌ఐసీకి నోటీస్ వచ్చింది. ఆ తర్వాత కంపెనీ జనవరి 3న స్టాక్ మార్కెట్లకు నోటీసులు తెలియజేసింది. వస్తువులు, సేవల పన్ను చెల్లింపులో లోటుతో రూ.663.45 కోట్ల డిమాండ్ నోటీసును ఎల్‌ఐసీ అందుకుంది. ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కంపెనీ తప్పుగా ఉపయోగించుకుందని నోటీసులో పేర్కొంది. 2017-18, 2018-19లో GSTR-1లో టర్నోవర్‌ను GST యేతర సరఫరాగా కంపెనీ ప్రకటించింది. దానిపై పన్ను చెల్లించాలి. నోటీసులో, నిర్ణీత గడువులోగా అప్పీల్ దాఖలు చేయడానికి ఎల్‌ఐసీకి అవకాశం ఇచ్చారు. మహారాష్ట్ర జీఎస్టీ నోటీస్ మహారాష్ట్ర జీఎస్టీ నుంచి రూ.800 కోట్లకుపైగా జీఎస్టీ నోటీసును ఎల్ఐసీ అందుకుంది.

    2017-18కి సంబంధించి లోటుపాట్లకు మహారాష్ట్ర పన్నుల డిప్యూటీ కమిషనర్ రూ. 806.3 కోట్ల నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులో రూ. 365.02 కోట్ల జీఎస్టీ బకాయిలు, రూ. 404.7 కోట్ల పెనాల్టీ, రూ. 36.5 కోట్ల వడ్డీ ఉన్నాయి. 2023, డిసెంబర్ లో తెలంగాణ జీఎస్టీ రూ.183 కోట్ల నోటీసును ఎల్ఐసీకి అందజేసింది. సెప్టెంబర్, 22న ఎల్‌ఐసీకి బీహార్ జీఎస్టీ నుంచి నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ రూ.290 కోట్లకు పైన ఉంది. 2023, అక్టోబర్‌లో తక్కువ పన్ను చెల్లించినందుకు ఎల్‌ఐసీకి జీఎస్‌టీ అధికారులు రూ.36,844 జరిమానా విధించారు. అక్టోబర్‌లోనే జమ్ము కశ్మీర్ జీఎస్టీపై ఎల్‌ఐసీకి నోటీసులిచ్చింది.

    Share post:

    More like this
    Related

    Vijayawada : అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు.. నారీ శక్తి విజయోత్సవ సభలో నారా భువనేశ్వరి

    Vijayawada : మహిళా శక్తికి నిదర్శనమని సీఎం చంద్రబాబు సతీమణి నారా...

    America : అమెరికాలో మిల్టన్ హరికేన్ బీభత్సం..16మంది మృతి.. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం

    America : మిల్టన్ హరికేన్ సృష్టించిన సుడిగాలి, వరదలు అమెరికాలోని ఫ్లోరిడాలో...

    Chandrababu : ఇంద్రకీలాద్రికి సతీసమేతంగా సీఎం చంద్రబాబు

    సీఎం చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారిని చంద్రబాబు, లోకేష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Medplus : ‘డెడ్’ప్లస్ మెడికల్ దందా.. స్టింగ్ ఆపరేషన్ తో సంచలన నిజాలు బయటకు?

    Medplus : మెడ్ ప్లస్.. ఇదో ప్రముఖ రిటైల్ ఫార్మసీ చెయిన్....