19.8 C
India
Thursday, January 23, 2025
More

    Jamili Elections 2029 : 2029 మే, జూన్ నెల మధ్య దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు

    Date:

    Jamili Elections 2029 : 2029 మే, జూన్ నెల మధ్య దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా లా కమిషన్‌ ప్రతిపాదించనుంది. ఇందుకోసం రాజ్యాంగంలో కొత్త అధ్యాయాన్ని చేర్చేలా సవరణలకు లా కమిషన్‌ సిఫార్సు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదే జరిగితే 2029 లో జరగనున్న 19 వ లోక్‌సభకు నిర్వహించే సార్వత్రిక ఎన్నికలతో పాటే దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు పోలింగ్ నిర్వహించే వీలు ఉంటుందని లా కమిషన్‌ అభిప్రాయపడుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి అందించనున్న ప్రతిపాదనలు ఇవే అని తెలుస్తోంది.

    రాజ్యాంగంలో కొత్తగా చేర్చే చాప్టర్‌లో ఒకే దేశం ఒకే ఎన్నికలు.. వాటి సుస్థిరత, లోక్‌సభ, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలకు సరిపోయేలా ఉమ్మడి ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు ఉండాలని లా కమిషన్ కీలక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. దేశంలోని అన్ని అసెంబ్లీలకు సంబంధించి ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న నిబంధనలను భర్తీ చేసేలా కొత్త చాప్టర్‌ను రూపొందించాలని పేర్కొన్నట్లు సమాచారం.

    జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాల అసెంబ్లీ గడువులను 3 దశల్లో సర్దుబాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అంటే దేశంలోని కొన్ని రాష్ట్రాల శాసనసభల కాల వ్యవధిని పొడిగించడం.. మరికొన్నింటి రాష్ట్రాల అసెంబ్లీల కాల వ్యవధిని తగ్గించాలని పేర్కొన్నట్లు సమాచారం. ఒకవేళ అవిశ్వాసంతో ప్రభుత్వాలు కూలిపోయినా లేదా హంగ్‌ ప్రభుత్వాలు ఉన్నా.. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కీలక ప్రతిపాదన చేసింది. ఒక వేళ ఈ విధానం పని చేయకపోతే.. అసెంబ్లీ మిగతా కాలానికి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్‌ సిఫార్సులు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

    Share post:

    More like this
    Related

    Trump Signature : సైన్ చేశారా.. పర్వతాలను గీశారా?: ట్రంప్ సిగ్నేచర్ పై సెటైర్లు

    Trump Signature : అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూ పలు పేపర్ల...

    Singer Sunitha : సింగర్ సునీతకు బిగ్ షాక్.. భర్త కంపెనీలో ఐటీ సోదాలు

    singer Sunitha : తెలంగాణలో ఉదయం నుంచి ఐటీ అధికారులు హల్ చల్...

    Kiran Abbavaram : తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో

    Hero Kiran Abbavaram :టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి...

    President Trump : వెల్ కం టు హోం ప్రెసిడెంట్ ట్రంప్.. వైరల్ పిక్

    President Trump : అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దంపతులు గ్రాండ్ గా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Govt : ఏపీలో ఆ 10 జిల్లాలకు కేంద్రం శుభవార్త! నిధులు విడుదల!

    AP Govt : కేంద్రం ఏపీకి శుభవార్త చెప్పింది.. కొత్తగా చేనేతల...

    Midterm Elections : జమిలి ఎన్నికలతో దేశంలో సమూల మార్పులు

    Midterm elections : జమిలి ఎన్నికలతో దేశంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని...

    Jamili : జమిలికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం.. 3.0లోనే అమలుకు శ్రీకారం..

    Jamili Elections : భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి...

    Chandrababu : కేంద్రంలో ‘చంద్రబాబే’ కింగ్.. అది ఆంధ్రకు ఎంత మేరకు మేలు చేస్తుంది?

    Chandrababu : దేశంలో అత్యంత కీలకమైన సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. బీజేపీ...