21 July Horoscope :
సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
వృషభ రాశి వారికి శ్రమ పెరిగినా విజయాలు సాధిస్తారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. మానసికంగా ప్రశాంతంగా ఉండండి. లక్ష్మీగణపతి ని పూజించడం ద్వారా మంచి లాభాలున్నాయి.
మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మంచి కాలం. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఇష్టదేవతను ఆరాధించడం మంచిది.
కర్కాటక రాశి వారికి బంధుమిత్రుల్లో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదివితే మంచి ఫలితాలు వస్తాయి.
సింహ రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
కన్య రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి కాలం. ఆరోగ్యం బాగుంటుంది. బంధువులు కూడా సహకరిస్తారు. దుర్గారాధన మంచి చేస్తుంది.
తుల రాశి వారికి అధికారులతో జాగ్రత్త. చెడు ఆలోచనలు రాకుండా చేసుకోవాలి. పనుల్లో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది.
వృశ్చిక రాశి వారికి ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలి. నూతన పనులు చేపట్టకపోవడమే మంచిది. లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
ధనస్సు రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో విజయాలు ఉన్నాయి. మీ ఆలోచనలే ఉన్నతంగా ఉంటాయి. రాహు ధ్యాన శ్లోకం చదవడం ద్వారా అనుకూల ఫలితాలు కలుగుతాయి.
మకర రాశి వారికి వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బిల్వాష్టకం చదవడం ద్వారా ఇంకా మంచి ఫలితాల దక్కుతాయి.
కుంభ రాశి వారికి మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు. ప్రయాణాలు లాభిస్తాయి. శివుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది.
మీన రాశి వారికి శ్రమ పెరిగినా విజయం మీదే. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. పంచముఖ ఆంజనేయుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
ReplyForward
|