23rd September Horoscope : మేష రాశి వారికి పనుల్లో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ఆలోచించి తీసుకోవాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
వ్రషభ రాశి వారికి పనుల్లో శ్రమ ఎక్కువవుతుంది. సమయానుకూలంగా స్పందించాలి. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. దుర్గా అష్టోత్తర శత నామావళి చవడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి వారికి ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. పనుల్లో వేగం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదేవత ఆరాధన చాలా మంచిది.
కర్కాటక రాశి వారికి మంచి కాలం. ఉద్యోగంలో అనుకూల ఫలితాలుంటాయి. కీలక సమస్యలు పరిష్కరించుకుంటారు. గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
సింహ రాశి వారికి శ్రమ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. దుర్గా అష్టోత్తరం చదువుకుంటే మంచిది.
కన్య రాశి వారికి ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. గొడవలకు దూరంగా ఉంటేనే మంచిది. చంద్ర శ్లోకం చదవడం ఉత్తమం.
తుల రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభకార్యక్రమాలు చేపడతారు. ఒక శుభవార్త మీలో సంతోషాన్ని కలిగిస్తుంది. సూర్యాష్టకం చదవడం అనుకూలం.
వ్రశ్చిక రాశి వారికి ముఖ్యమైన పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభాలు కలుగుతాయి.
ధనస్సు రాశి వారికి పనుల్లో ముందు చూపు ఉంటుంది. మంచి ఆలోచనతో ముందుకు వెళతారు. శివ నామస్మరణ చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.
మకర రాశి వారికి ఒక శుభవార్త సంతోషం తెస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మీ నిజాయితీయే మీకు రక్షణగా నిలుస్తుంది. శ్రీరామ నామం జపించడం వల్ల మేలు కలుగుతుంది.
కుంభ రాశి వారికి మనో ధైర్యం పెరుగుతుంది. కొన్ని సంఘటనలు బాధిస్తాయి. కుటుంబంలో ఉత్సాహవంతమైన పరిస్థితులు ఉంటాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించడం మంచిది.
మీన రాశి వారికి చేసే పనుల్లో విజయం లభిస్తుంది. ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి ఆరాధన శుభకరంగా ఉంటుంది.