
24th June Horoscope Results : మేష రాశి వారికి మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకండి. ముఖ్యమైన విషయాల్లో సూచనలు పాటించాలి. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే మంచి ఫలితాలుంటాయి.
వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మామూలుగా ఉంటుంది. మనోధైర్యం కలిగి ఉంటే విజయం మీదే. స్నేహితుల సహకారం లభిస్తుంది. దైవారాధన మీకు మేలు చేస్తుంది.
మిథునరాశి వారికి ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. మీ తెలివితేటలతో సమస్యల్ని పరిష్కరించుకుంటారు. గణపతి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
కర్కాటక రాశి వారు శ్రమ పెరిగినా విజయం సాధిస్తారు. అందరిని కలుపుకుని వెళ్లండి. ఈశ్వర దర్శనం మంచి లాభాలు కలిగిస్తుంది.
సింహ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. దైవారాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.
కన్య రాశి వారికి పనులు సాఫీగా సాగుతుతాయి. వృత్తిలో గుర్తింపు ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు.
తుల రాశి వారికి మనోబలం కలిగి ఉంటారు. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. ఆంజనేయ స్వామిని దర్శిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.
వృశ్చిక రాశి వారికి చేపట్టే పనుల్లో ముందుకు సాగండి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. దైవబలంతో మంచి జరుగుతుంది.
ధనస్సు రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయం మీదే. మనో ధైర్యంతో ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. శివున్ని ఆరాధిస్తే మంచిది.
మకర రాశి వారికి ఉత్సాహంతో ముందుకు వెళ్లాలి. తోటి వారే మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారు. దుర్గారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కుంభ రాశి వారికి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధువుల సహకారం ఉంటుంది. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల చాలా లాభాలు ఉంటాయి.
మీన రాశి వారికి మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. దైవారాధన చేయడం వల్ల మేలు కలుగుతుంది.