25 hours : రోజు అంటే 24 గంటలు, ఏడు రోజులైతే వారం.. 365 రోజులైతే ఏడాది. ఎక్క ఇలాగే ఉంటుంది కదా..! కానీ ఇది త్వరలో మారబోతోంది. కారణం చంద్రుడు అంటూ చెప్తున్నారు శాస్త్రవేత్తలు. విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీ ఇటీవల చేసిన పరిశోధనల్లో రోజుకు 25 గంటల ఉండబోతాయిన చెప్పింది. చంద్రుడు ఏడాదికి భూమి నుంచి 3.8 సెంటీ మీటర్లు దూరం వెళ్తున్నాడని అందుకే ఈ మార్పు జరుగుందన్నారు. అయితే ఈ సమయాన్ని ఇప్పుడు బతికి ఉన్న వారు ఎవరూ చూడలేరు. ఎందుకంటే ఇది జరిగేందుకు 200 మిలియన్ సంవత్సరాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. 1.4 బిలియన్ల క్రితం రోజుకు 18 గంటలే ఉండేదట. రాను రాను అది 24 గంటలు అయ్యింది. ఇప్పుడు ఇది 25 గంటలుగా మారబోతోంది. గురుత్వాకర్షణలో కూడా మార్పు వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
Breaking News
25 hours : ఇకపై రోజుకు 25 గంటలు.. చంద్రుడి వైపు చూపు.. అసలు ఏం జరుగుతోంది?
Date: