25th September Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలున్నాయి. మంచి ఆలోచన విధానం ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది.
వ్రషభ రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకోవాలి. కొందరి తీరు బాధకు కారణమవుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయట పడతారు. గోసేవ చేయడం శుభకరం.
మిథున రాశి వారికి సంఘంలో మీ పలుకుబడి పెరుగుతుంది. ఆచితూచి వ్యవహరించాలి. భవిష్యత్ గురించి ప్రణాళికలు వేసుకుంటారు. హనుమాన్ చాలీసా చదవడం ఉత్తమం.
కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. లక్ష్మీదేవిని దర్శిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి వారికి కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనుకున్న పనులు నెరవేరతాయి. మంచి ఫలిలాలు కలుగుతాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మేలు కలుగుతుంది.
కన్య రాశి వారికి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఒక శుభవార్త మీలో సంతోషాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదవడం మంచిది.
తుల రాశి వారికి ఉత్సాహంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.
వ్రశ్చిక రాశి వారికి చేపట్టిన పనుల్లో పురోగతి లభిస్తుంది. మానసికంగా బలంగా ఉంటారు. ఇష్టదేవత స్తోత్రతం చదవడం వల్ల అనుకూలంగా ఉటుంది.
ధనస్సు రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. పనులు పూర్తి చేసుకుంటారు. దుర్గా ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
మకర రాశి వారికి అవసరానికి సాయం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆంజనేయ స్తోత్రం చదవడం వల్ల మంచి లాభాలున్నాయి.
కుంభ రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. నిద్రాహారాలు ఉండేలా చూసుకుంటే మంచిది. విష్ణు ఆరాధన చేయడం శుభకరం.
మీన రాశి వారికి సమయనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. మంచి ఫలితాలు దక్కుతాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మేలు కలుగుతుంది.