26th June Horoscope : మేష రాశి వారికి బంధుమిత్రులతో గడుపుతారు. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తారు. ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
వృషభ రాశి వారికి శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. గతంలో చేసిన పొరపాట్లు ఇబ్బందులు కలిగిస్తాయి. కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా మనోధైర్యం కలిగి ఉంటారు. ఆవుకు ఏదైనా తినిపించడం మంచిది.
మిథున రాశి వారికి మనో బలం పెరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలతో ముందుకెళ్తారు. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
కర్కాటక రాశి వారి ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈశ్వరుడిని దర్శిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
సింహ రాశి వారికి పనుల్లో జాగ్రత్తలు పాటించాలి. ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవాలి. బంధువులు సహకరిస్తారు. అనవసర ఖర్చులను తగ్గించుకోండి. సుబ్రహ్మణ్య అష్టోత్తర నియమావళి చదవడం మంచిది.
కన్య రాశి వారికి పరిస్థితులు అనుకూలంగా మారతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
తుల రాశి వారికి కీలక పనుల్లో ముందడుగు వేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఇష్ట దైవాన్నిప్రార్థిస్తే మంచిది. కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
వృశ్చిక రాశి వారికి మంచి ఆలోచన విధానంతో ముందుకు వెళతారు. ఆధ్యాత్మికత మనకు మేలు చేస్తుంది. ఒక వార్త సంతోషాన్నిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చదివితే మంచి ఫలితాలు ఉంటాయి.
ధనస్సు రాశి వారికి సంతోషకరమైన వార్తలు వింటారు. సానుకూల పరిస్థితులు ఉంటాయి. ధనలాభం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మంచిది.
మకర రాశి వారికి సమస్యలు వచ్చినా ధైర్యంగా ముందుకు నడుస్తారు. మనోధైర్యమే రక్షణగా ఉంటుంది. విష్ణ సహస్ర నామం జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
కుంభ రాశి వారికి శారీరక శ్రమ పెరిగినా ఫలితాలు వస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. దుర్గ అష్టోత్తర పారాయణం చేయడం మంచిది.
మీన రాశి వారికి ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో ఒడిదుడుకులను తట్టుకోవాలి. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. శివారాధన చేయడం మంచి ఫలితాలు కలిగిస్తుంది.