27th September Horoscope : మేష రాశి వారికి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. ముఖ్య విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టదేవత ఆరాధన మేలు కలిగిస్తుంది.
వ్రషభ రాశి వారికి మనోధైర్యంతో ఉంటారు. ఆత్మవిశ్వాసంతో విజయాలు నమోదు చేస్తారు. గొడవలకు పోవడం అంత మంచిది కాదు. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.
మిథున రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఆందోళనలు పడితే నష్టమే. అందరిని కలుపుకుని పోతే మంచి జరుగుతుంది. దుర్గా స్తోత్రం చదివితే అనుకూల ఫలితాలుంటాయి.
కర్కాటక రాశి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సహాయ సహకారాలు అందుతాయి. సూర్యాష్టకం చదివితే మంచి లాభాలు కలుగుతాయి.
సింహ రాశి వారికి మానసిక ఉల్లాసం కలుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విష్ణు నామ స్మరణ ఉత్తమ ఫలితాలు కలగజేస్తుంది.
కన్య రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. పనుల్లో ముందడుగు వేస్తారు. శివారాధన చేయడం మేలు చేస్తుంది.
తుల రాశి వారికి కొన్ని సంఘటనలు బాధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. అందరిని గుడ్డిగా నమ్మితే నష్టం. సూర్య నమస్కారం మంచి లాభాలు కలిగిస్తుంది.
వ్రశ్చిక రాశి వారికి మనోబలంతో ముందడుగు వేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. దుర్గ అష్టోత్తర శతనామావళి చదివితే మంచిది.
ధనస్సు రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. పనుల్లో విజయం దక్కుతుంది. ఇష్టదేవత ఆరాధన అనుకూల ఫలితాలు వచ్చేలా చేస్తుంది.
మకర రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి. శివ నామస్మరణ చేయడం వల్ల మేలు కలుగుతుంది.
కుంభ రాశి వారికి శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళతారు. సుబ్రహ్మణ్య స్వామినిపూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
మీన రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. మీ పనితీరుకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. అనుకూల వాతావరణం ఉంటుంది. శని శ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.