26.5 C
India
Tuesday, October 8, 2024
More

    Village boy : పల్లెటూరి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే రూ.3 లక్షలు.. అమ్మాయిల ఆందోళనతో జపాన్ సర్కార్ షేక్

    Date:

    Village boy
    Village boy Marriage

    Village boy : పెళ్లికాని యువకులు పెరిగిపోతున్నారు. ఈ సమస్య ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా జపాన్ లో అయితే పెళ్లి, పిల్లలు, సంసారం అనే వాటికి యువత దూరమయింది. దీంతో జపాన్ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని అబ్బాయిలను పెళ్లి చేసుకునేందుకు కొత్త పథకాన్ని అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చింది.

    ఈ పథకం ప్రకారం.. జపాన్ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని అబ్బాయిలను అమ్మాయిలు చేసుకుంటే మన భారత కరెన్సీలో మూడున్నర లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. జపాన్ దేశం కరెన్సీలో 6 లక్షల యెన్ లు.. ఈ డబ్బులు అమ్మాయిల బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఈ స్కీం తీసుకురావడానికి ముఖ్య కారణం లేకపోలేదు. జపాన్ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో జనాభా సంఖ్య భారీ స్థాయిలో తగ్గిపోతుంది. అందరూ పట్టణాలు, నగరాలకు వలస వెళ్తున్నారు. దీన్ని అరికట్టి గ్రామీణ ప్రాంతాల్లో జనాభా సంఖ్య పెంచటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. జపాన్ దేశంలోని ఏ ప్రాంతం అమ్మాయి అయినా సరే గ్రామీణ ప్రాంతంలోని అబ్బాయిని పెళ్లి చేసుకొని అక్కడే నివాసం ఉండాలి. అక్కడే పిల్లలను కనాలన్న మాట.

    ఈ పథకంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. మహిళల స్వేచ్ఛకు, సమానత్వానికి ఇది భంగం అంటూ నిరసనలకు దిగారు. ఇక అమ్మాయిలు అయితే రచ్చ రచ్చ చేశారు. మేం అంత తక్కువగా కనిపిస్తున్నామా.. మాకు స్వేచ్ఛ లేదా.. మాకు సొంత ఆలోచన లేదా.. మిమ్మల్ని బానిసలుగా చూస్తున్నారా అంటూ ఆందోళనలకు దిగారు. మేం ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా ప్రభుత్వమే డిసైడ్ చేస్తుందా అంటూ జపాన్ అమ్మాయిలు గరంగరం అయ్యారు. దీంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది.

    ఇది జపాన్ ఒక్క దేశానికే పరిమితమైన సమస్యగా చూడాల్సిన అవసరం లేదు. ఇది భారతదేశంలోనూ ఉన్నదే. రైతు అంటే పిల్లను ఇచ్చేవారు రోజురోజుకూ తగ్గిపోతున్నారు. చిన్న ఉద్యోగమైనా అది టౌన్ లో ఉండాలి.. అబ్బాయి అక్కడే ఉండాలనే ఆలోచన అమ్మాయిల్లో బలంగా ఉంది. ఇది నిజంగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని రైతుబిడ్డలు ఎదుర్కొంటున్న సమస్య.

    Share post:

    More like this
    Related

    journalists : జర్నలిస్టులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందా..? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో మరి!

    journalists : కరీంనగర్ లోని జర్నలిస్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం పండుగు పూట...

    prison : దసరా వరకు జైళ్లలో ఇష్టా భోజనం.. ఎందుకు పెడుతున్నారంటే?

    prison : జగత్తుకు అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ. అలాంటి అమ్మ...

    Robots : మనుషులొద్దు.. రోబోలే ముద్దు.. వాటితో శృంగారానికి ప్రాధాన్యత

    Robots : శృంగారం విషయంలో మహిళల ఆలోచనలో మార్పు రానుందా? శృంగారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Advanced Technology : అడ్వాన్స్ డ్ టెక్నాలజీ దేశంలో బియ్యం కొరత.. అల్లాడుతున్న ప్రజలు

    Advanced Technology : ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇండియా కంటే అడ్వాన్స్...

    Earthquake : జపాన్ లో భారీ భూకంపం.. భయం తో పరుగులు తీసిన జనం..

    Earthquake in Japan : జపాన్ లో గురువారం ఉదయం భారీ భూకంపం...

    చంద్రబోస్ సొంత ఊర్లో సంబరాలు

    నాటు నాటు పాట రాసిన రచయిత చంద్రబోస్ స్వగ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి....