30 Years Industry Prithvi : టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో చాలా ఫేమస్ అయిన నటుడు పృథ్వీరాజ్.. ఆయన పూర్తి పేరు బలిరెడ్డి పృథ్వీ రాజ్. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పలు సినిమాలలో కమెడియన్ గా నటించి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. అయితే గత ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేసి పార్టీ విజయంలో ఎంతో కృషి చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు గత ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవి అప్పగించింది. కానీ ఆయన పై లైంగిక ఆరోపణలు రావడంతో చైర్మన్ పదవి నుంచి తప్పించారు. ఇక ఈయన చైర్మన్ పదవి పోవడంతో పరోక్షంగా అధికార పార్టీ పై విమర్శలు గుప్పించారు.
ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు జనసేన పార్టీలోకి చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కూటమి తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి విజయంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకోసం ప్రస్తుతం ఆయనకు ఏదో కీలక పదవి దక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి కాసేపట్లో కాపు కార్పోరేషన్ చైర్మన్ లేదా ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి..? సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చారు.