
30th September Horoscope : మేష రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవడం వల్ల మంచి జరుగుతుంది.
వ్రషభ రాశి వారికి మానసిక ఉల్లాసం కలుగుతుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
మిథున రాశి వారికి ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. పనులు త్వరగా పూర్తి చేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. ఇష్టదేవత స్తోత్రం చదవడం మంచిది.
కర్కాటక రాశి వారికి మంచికాలం. ఉద్యోగంలో అనుకూల ఫలితాలున్నాయి. పనుల్లో వేగం పెరుగుతుంది. గణపతి ఆరాధన మంచి ఫలితాలు కలగజేస్తుంది.
సింహ రాశి వారికి సమయానుకూలంగా ముందుకు వెళతారు. కొందరి ప్రవర్తన బాధ కలుగుతుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. దుర్గ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.
కన్య రాశి వారికి శ్రమతో మంచి ఫలితాలు వస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పట్టుదలతో ముందడుగు వేస్తారు. గురు అష్టోత్తరం చదవితే లాభాలు వస్తాయి.
తుల రాశి వారికి ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. సమయానికి సాయం చేస్తారు. సూర్యాష్టకం చదవడం శుభకరం.
వ్రశ్చిక రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సాయం అందుతుంది. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభాలు కలుగుతాయి.
ధనస్సు రాశి వారికి మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. ముందుచూపు ఉండాలి. మంచి పేరు ప్రతిష్టలు దక్కుతాయి. శివనామస్మరణ చేయడం మంచిది.
మకర రాశి వారికి మొహమాటం వదిలేయండి. ప్రయాణాల్లో లాభాలున్నాయి. ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. శ్రీరామ నామం జపిస్తే మంచి జరుగుతుంది.
కుంభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకోవాలి. చంద్రశ్లోకం చదవడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి.
మీన రాశి వారికి సంతోషం కలుగుతుంది. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. అన్ని రంగాల్లో మీదే పైచేయి అవుతుంది. వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం మేలు చేస్తుంది.