
Kalki Movie Collections : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ, కొందరు మాత్రమే ఇండస్ట్రీని ఏలుతున్నారు. అలాంటి వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ప్రభాస్ ఈ ఘనత అతి తక్కువ కాలంలో దక్కించుకున్నారు. ఒక్కో స్టార్ హీరో ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఏళ్లు పట్టింది. కానీ ప్రభాస్ మాత్రం తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు.. పాన్ ఇండియా, వరల్డ్ స్థాయికి చేరుకున్నారు.
ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా మొత్తం గూజ్ బంప్స్ తో సాగుతుంది. కుర్చీ ఎడ్జిలో ఉండి మరీ మూవీని ఆస్వాదిస్తున్నాడు సగటు ప్రేక్షకుడు. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ మూవీకి ఇప్పటికే మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా భారీగానే రాబడుతోంది. ఈ నేపథ్యంలో ‘కల్కి’ 7 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?
కల్కిగా ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రంలో దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటించింది. అమితాబ్, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
బిజినెస్ గురించి తెలుసుకుంటే?
ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీకి నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఏపీలో రూ. 76 కోట్లతో కలిపి మొత్తం తెలుగులో రూ. 168 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే తమిళనాడులో రూ. 16 కోట్లు, కర్ణాటకలో రూ. 25 కోట్లు, రెస్టాఫ్ ఇండియా + హిందీలో రూ. 85 కోట్లు, కేరళలో రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లతో కలిపి రూ. 370 కోట్లు బిజినెస్ జరిగింది.
ఏడో రోజు ఇలా..
రెబెల్ స్టార్ ప్రభాస్ – క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’కి ఏడో రోజు కూడా భారీగానే స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. మిగిలిన అన్ని ఏరియాలు కలుపుకొని రూ. 15 కోట్లు రాబట్టింది. ఇలా వారంలో రూ. 335 కోట్లు షేర్ వసూలు చేసి సత్తా చాటింది.