Jailor : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఏజ్ లో కూడా ఫ్యాన్స్ కోసం వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. తలైవర్ కు మంచి యాక్షన్ అండ్ మాస్ సినిమా పడాలే కానీ ఇప్పుడు కూడా రికార్డులను తిరగరాసే సత్తా ఉందని తాజాగా రిలీజ్ అయిన సినిమాతో రుజువు చేస్తున్నాడు..
రజినీకాంత్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”జైలర్” బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తుంది.. ఈ సినిమాతో చాలా ఏళ్ల దాహం తీర్చుకుంటున్నాడు సూపర్ స్టార్.. గత దశాబ్ద కాలంలో రజినీకాంత్ కు దగ్గని బ్లాక్ బస్టర్ హిట్ జైలర్ తో దక్కింది అనే చెప్పాలి.. దీంతో ఈ సినిమా కోలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చూపిస్తుంది.
కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ఆగస్టు 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా 4 రోజుల్లోనే రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. మూడు రోజుల్లోనే 200 కోట్ల మార్క్ క్రాస్ చేసి సంచలనం సృష్టించిన ఈ సినిమా ఆదివారం కూడా తగ్గకుండా కలెక్షన్స్ రాబట్టింది.
జైలర్ 4వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. 35 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టిందని తెలుస్తుంది.. ఇలా నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ఇండియాలో 143.40 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 222.1 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 7 కోట్ల లాభాలను రాబట్టిన జైలర్ ఈ రోజు రేపు ఆగస్టు 15న మరిన్ని కోట్లు రాబట్టి నిర్మాతల జేబులు నింపేసేలానే ఉందని అంటున్నారు.