24 C
India
Sunday, October 11, 2026
More

    5 SUVs : ఈ 5 SUVs మైలేజ్‌లో అగ్రస్థానం.. లీటర్‌కు ఎంతో తెలుసా?

    Date:

    5 SUVs are top in mileage
    5 SUVs are top in mileage

    5 SUVs :

    SUV కార్లకు ఇండియన్ మార్కెట్లో క్రేజ్ రాను రాను పెరుగుతోంది. వాహన ప్రియులు ఎస్‌యూవీనే ఎక్కువగా ఇష్టపడతారు. మిడ్-సైజ్ కార్లకు ఇండియన్ మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. పోటీ కూడా ఎక్కువనే చెప్పవచ్చు. ఒక వేళ మీరు కూడా SUVను కొనాలనుకుంటే వాటి మైలేజ్, రకం, ఏది బెస్టో ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోండి. మంచి మైలేజ్‌ ఇచ్చే టాప్‌-5 వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

    హ్యుందాయ్ క్రెటా..
    హ్యుందాయ్ కు ఇండియన్ మార్కెట్ భారీ లాభాలను తెచ్చిపెడుతోంది. ఇందులో క్రెటా అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలో ఒకటిగా నిలిచింది. 1.5 లీటర్ సహజంగా ఆశించిన 4 సిలిండర్ ఇంజిన్ శక్తిని పొందుతుంది. ట్రాన్స్‌మిషన్ కోసం 6 స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది. దీంతో పాటు ఇతర ఇంజిన్ ఆప్షన్‌లు కూడా ఉన్నాయి. క్రెటా లీటర్ పెట్రోల్‌కు 16.85 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ.10.87 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

    కియా సెల్టోస్..
    సౌత్ కొరియాకు చెందిన కార్ల కంపెనీ కియా కూడా మైలేజ్ లో బెస్ట్ అని చెప్పచ్చు. ఇది ఎక్కువ ఇంజిన్ ఆప్షన్‌ తో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. కియా సెల్టోస్ 17.8 కేఎంపీఎల్ ఇస్తుంది. ఈ ఎస్‌యూవీ ఎక్స్ షోరూం ధర రూ.10.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

    స్కోడా కుషాక్..
    స్కోడా కుషాక్ సురక్షితమైన ఎస్‌యూవీ. ఇది 1.5-లీటర్, 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో సహా ఇతర ఇంజిన్ ఆప్షన్లను పొందుతుంది. ఐడల్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌, ఎస్‌యూవీ 17.83 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది. స్కోడా కుషాక్ ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.11.59 లక్షలు.

    వోక్స్‌వ్యాగన్ టైగన్..
    వోక్స్‌ వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ లాంటి ఎస్‌యూవీ కార్లు. టిగన్ 1.5-లీటర్, 4 సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇదే కాకుండా, స్పెసిఫికేషన్స్, ఫీచర్ల పరంగా కూడా కుషాక్‌ను పోలి ఉంటుంది. ఇది 18.18 కేఎంపీఎల్ మైలేజ్ అందిస్తుంది. దీని ఎక్స్ షోరూం ప్రైజ్ రూ. 11.61 లక్షల నుంచి మొదలవుతుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related