
Shobana : శోభన ప్రస్తుత యంగ్ జనరేషన్ కు అంతగా పరిచయం లేకున్నా.. 19’sలో మాత్రం చాలా ఫేమస్ యాక్టరస్. ఆమె సినిమాలో ఉందంటే వెళ్లేవారు ఆ జమానాలో చాలా మందే ఉండేవారు. అందం, అభినయం, నాట్యం, నటన అన్నీ కలగలిపినట్లుండేది ఆమె. బెసిక్ గా ఆమె కూచిపూడి డాన్సర్ కావడంతో డాన్స్, సీన్ కు తగ్గట్లు హావ, భావాలు ఇస్తుండేవారు. ఆమెకు నాట్య మయూరి అని బిరుదు కూడా ఉంది.
తెలుగింటి ఆడపడుచుగా కనిపించిన ఆమె మలయాళీ. పద్మిని, రాగిణి, లలితల మేనకోడలు. వీరు కూడా మలయాళ సినిమాలో మంచి నటులు, డాన్సర్లు. 1984లో ‘శ్రీమతి కానుక’ సినిమా ద్వారా వెండితెరపై అరంగేట్రం చేసిన శోభన ప్రస్థానం చాలా కాలం కొనసాగింది. సుమన్, నాగార్జున, విక్రమ్, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు ఇలా చాలా మంది స్టార్ హీరోలతో నటించింది ఆమె.
మళయాలంలో వచ్చిన ‘మణి చిత్ర తాళు’లో తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించున్న ఆమెను అవార్డులు వరించాయి. ఆమె నాట్యానికి చేస్తున్న సేవ విలువకట్టలేనిది. 1994లో ‘శోభన కళార్పణ’ సంస్థను స్థాపించి తన శిష్యుల ద్వారా నాట్యాన్ని విస్తరిస్తోంది. ఎంత మంది కళాకారులను ఆమె తయారు చేసింది.
50 సంవత్సరాలు సమీపిస్తున్నా ఇప్పటికీ ఆమె పెళ్లి చేసుకలేదు. ఎందుకని గతంల కొంత మంది ప్రశ్నించగా.. తాను హీరోయిన్ గా ఉన్న సమయంలో మలయాళ హీరోను ప్రేమించాను. ఆ హీరో మోసం చేయడంతో ఒంటరిగా ఉండాలని డిసైడ్ అయినట్లు చెప్పారు. అయితే ఆమె పూర్తిగా ఒంటరిగా ఉండకుండా ఒక చిన్నారిని దత్తత తీసుకుంది. ఇక, ఇప్పుడు నాట్యమే ఆమెకు లోకం. 2021లో పరిణయం అనే సినిమాల కనిపించిన ఆమె సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిందని చెప్పవచ్చు.






