34.7 C
India
Friday, April 10, 2026
More

    నాలుగు రోజుల్లో 500 సిగరేట్లు.. విషమంగా అల్లరి నరేశ్ ఆరోగ్యం..

    Date:

    allari_naresh
    Allari_naresh
    స్మోకింగ్ ఈజ్ కిల్ అని పదే పదే చెప్తున్నా కొందరు వినరు. చైన్ స్మోకింగ్ ఫ్యాషన్ అంటూ చెప్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అల్లరి నరేశ్ నాలుగు రోజుల్లో ఏకంగా 500 సిగరేట్లు తాగడట. ఈ లెక్కన రోజుకు 125 అన్నమాట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇది విన్న ఆయన అభిమానులు, నెటిజన్లు షాక్ కు గురయ్యారు. ఇదేదో సరదాగా అనుకుంటే పొరబాటే..

    మారేడుపల్లి ప్రజానీకం అనుకున్నంత మేర ఆడలేదు. ఇక తర్వాతి చిత్రం అయినా ప్రతిష్టాత్మకంగా ఉండాలని అనుకున్నాడు నరేశ్. ఈ మధ్య ఆయన కథలో ఎంపికలో పంతా మార్చినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే విజయ్ కనకమేడల చిత్రం ‘ఉగ్రం’లో నటించారు నరేశ్. ఇది ఆయనకు 60వ చిత్రం. ఇందులో నరేశ్ కు జోడీగా మీర్నా మీనన్ నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు విజయ్ తెలిపాడు. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, పెద్ది హరీశ్ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఇందులో అల్లరి నరేశ్ పోలీస్ పాత్రలో సీరియస్ గా అలరించబోతున్నాడు. మే 5వ తేదీని రిలీజ్ డేట్ గా చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

    ఉగ్రం సినిమాపై నరేశ్ తో పాటు దర్శకుడికి భారీ అంచనాలే నెలకొన్నాయి. దీని ప్రమోషన్ లో భాగంగా నరేశ్ కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఈ మూవీ కోసం తాను చాల కష్టపడినట్లు చెప్పాడు. ‘ఈ సినిమాలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అది కూడా అడవిలో. ఈ ఫైట్ ను దాదాపు నాలుగు రోజులు చిత్రించాం. ఫైట్ మొత్తం హీరో నోట్లో సిగరేట్ ఉంటుంది.

    దీని కోసం నాలుగు రోజుల్లో ఏకంగా 500 కు పైగా సిగరేట్లు తాగాల్సి వచ్చింది. ఈ ఫైట్ చిత్రీకరణ పూర్తయ్యే వరకు నా ఆరోగ్య పరిస్థితి చాలా దిగజారింది. దగ్గు, జ్వరంతో తీవ్రంగా బాధపడ్డా. తర్వాత రెస్ట్ తీసుకొని కోలుకొని మిగతా పోర్షన్ పూర్తి చేశాం’ అని చెప్పాడు. నరేశ్ తన మొదటి సినిమా డెడికేషన్ గా పని చేస్తుంటాడని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీంతో పాటు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్లాలని సూచనలు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    శరత్ బాబుకు తీవ్ర అస్వస్థత.. హైదరాబాద్ కు తరలింపు

    నాటి తరం హీరోగా.. నేటి తరానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుపరిచితులైన...