
Court Movie : ‘కోర్ట్’ సినిమా విడుదలైన ఆరవ రోజున తెలుగు రాష్ట్రాల్లో కోటి 13 లక్షల రూపాయల షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అదే రోజున కోటి 58 లక్షల రూపాయలు వసూలు చేసిందని సమాచారం. బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్‌లో ఈ సినిమాకు ఇప్పటివరకు దాదాపు 8 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ వారాంతానికి ఈ సంఖ్య 1 మిలియన్ మార్క్‌ను చేరుకుంటుందని భావిస్తున్నారు. మొత్తంగా ఆరు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 34 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది, అలాగే షేర్ వసూళ్లు 18 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. ఈ వారాంతానికి ఈ చిత్రం 25 కోట్ల రూపాయల షేర్ మార్క్‌ను దాటేస్తుందని అంచనా వేస్తున్నారు.