IIT :
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఠక్కున గుర్తొచ్చేవి ఐఐటీ. ఎందరో విద్యార్థులు ఈ విద్యాసంస్థల్లో తమ విద్యాభ్యాసం కొనసాగించాలని కలలు కంటుంటారు. ఇందుకు అనుగుణంగా ప్రిపేర్ అవుతుంటారు. అయితే ఇక్కడ చదువుల కోసం వచ్చిన చాలా మంది విద్యార్థలు మధ్యలోనే ఆపేస్తున్నారని కేంద్రం తాజాగా సంచలన విషయాలు వెల్లడించింది. ఈ విద్యాసంస్థలో గత కొంత కాలంగా పెరిగిన ఆత్మ హత్యల ఆంశం కూడా బయటపెట్టింది.
ఈ విద్యాసంస్థల్లో చేరేందుకు పోటీ తీవ్రంగా ఉంటుంది. లక్షల్లో విద్యార్థలు ప్రవేశాల కోసం ఎదురు చూస్తుంటారు. కొందరు మాత్రమే వీటిల్లో సీట్లు సాధిస్తారు. కఠినమైన ఎంపిక ప్రక్రియ ను దాటుకొని సీటు పొందుతున్నారు. అయితే చాలా మంది మధ్యలోనే చదువును ఆపేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు 8 వేల మంది మధ్యలోనే చదువు ఆపేశారని కేంద్ర మంత్రి సుభాష్ సర్కార్ తాజాగా రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాగే 2018 నుంచి ఇప్పటివరకు 39 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. 2018 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో 98 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. అందులో ఐఐటీల్లో 39 మంది, ఎన్ఐటీల్లో 25, సెంట్రల్ యూనివర్సిటీల్లో 25, ఐఐఎంలో 4, మిగతా విద్యాసంస్థల్లో మరికొందరు మృతి చెందారు.
అయితే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం ఈ ఆత్మహత్యల లెక్కలు చెబుతున్నట్లు తెలిపారు. ఇందులో ఎక్కువగా మానసిక, కుటుంబ సమస్యలు చదువుల్లో ఒత్తిడి, ఒంటరి అనే కారణాలే ఉన్నట్లు తేల్చారు. అయితే విద్యాసంస్థల్లో తాము అనుకున్న స్థాయికి రావడం లేదని కూడా కొన్ని మరణాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఏదేమైనా ఈ లెక్కలు భారతీయ విద్యావ్యవస్థ తీరును ఎండగడుతున్నాయి.